https://oktelugu.com/

రాహుల్, పంత్ పోరాటం వృథా.. 337 పరుగులను ఛేదించిన ఇంగ్లండ్

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. మొదట్లో ఆచితూచి ఆడిన భారత బ్యాట్స్ మెన్ ఆ తర్వాత రూట్ మార్చారు. ఓపెనర్లు శిఖర్,రోహిత్ విఫలమైనా కూడా కేఎల్ రాహుల్ 108 సెంచరీతో చెలరేగాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ 66, రిషబ్ పంత్ 77 (కేవలం 40 బంతుల్లో), హార్ధిక పాండ్యా 35 (16 బంతుల్లో) దంచి కొట్టడంతో టీమిండియా 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2021 / 09:08 PM IST
    Follow us on

    ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. మొదట్లో ఆచితూచి ఆడిన భారత బ్యాట్స్ మెన్ ఆ తర్వాత రూట్ మార్చారు. ఓపెనర్లు శిఖర్,రోహిత్ విఫలమైనా కూడా కేఎల్ రాహుల్ 108 సెంచరీతో చెలరేగాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ 66, రిషబ్ పంత్ 77 (కేవలం 40 బంతుల్లో), హార్ధిక పాండ్యా 35 (16 బంతుల్లో) దంచి కొట్టడంతో టీమిండియా 337 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభారంభం దక్కలేదు. అయితే కేఎల్ రాహుల్, పంత్, కోహ్లీ, హార్ధిక్ లు ధాటిగా ఆడడంతో భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా పంత్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

    ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్లు రెచ్చిపోయారు. బెయిర్ స్టో సెంచరీ, బెన్ స్టోర్ 99 పరుగులతో సిక్సర్ల మోత మోగించారు. భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరి దాటికి 35 ఓవర్లలోనే ఇంగ్లండ్ స్కోరు 280కి చేరింది.

    అయితే గెలుపు మీద ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లను భారత బౌలర్లు వరుసగా ఔట్ చేశారు. బెన్ స్టోక్స్, బెయిర్ స్టో, కెప్టెన్ జోస్ బట్లర్ వరుసగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడింది. కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లండ్ 39 ఓవర్లలో 302 పరుగులతో విజయం దిశగా సాగుతోంది. చివర్లో లివింగ్ స్టన్ వరు సిక్సర్లు కొట్టడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ గెలుపులో బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (99) లు కీలక పాత్రలు పోషించారు.ఇద్దరూ సెంచరీలు బాదేయడంతో ఇంగ్లండ్ గెలుపు సునాయసమైంది.