https://oktelugu.com/

కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారిలో చాలామంది కొత్తకారును కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల వ్యక్తిగత అవసరాల నిమిత్తం వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త కారు కొనుగోలు కోసం రుణాలను మంజూరు చేస్తున్నాయి. తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్న నేపథ్యంలో కొత్తకారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వాళ్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 16, 2021 / 08:31 PM IST
    Follow us on

    మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారిలో చాలామంది కొత్తకారును కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల వ్యక్తిగత అవసరాల నిమిత్తం వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త కారు కొనుగోలు కోసం రుణాలను మంజూరు చేస్తున్నాయి.

    తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్న నేపథ్యంలో కొత్తకారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కారును వినియోగించే కొద్దీ విలువ తగ్గుతుంది కాబట్టి ఖర్చును భరించగలం అనుకుంటే మాత్రమే కొత్తకారును కొనుగోలు చేస్తే మంచిది. కారు కొనుగోలు చేయాలంటే వార్షిక ఆదాయంలో సగం ఖర్చు చేస్తే మంచిది. కారు ఆన్ రోడ్ ధరను పరిగణనలోకి తీసుకుని కారును ఎంచుకుంటే మంచిది.

    కారును కొనుగోలు చేసేవాళ్లు 20/4/10 థంబ్ రూల్ ను పాటించాలి. ఈ నియమం ప్రకారం పొదుపు నుంచి 20 శాతాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించాల్సి ఉండగా రుణం మొత్తం కాలవ్యవధి గరిష్టంగా 4 సంవత్సరాలుగా ఉండాలి. నెలవారీ ఈ.ఎం.ఐ ఆదాయంలో కేవలం 10 శాతం మాత్రమే ఉండాలి. దీర్ఘకాల లక్ష్యాలు దెబ్బ తినకుండా ఈ.ఎం.ఐను ఎంచుకోవడం ముఖ్యమని చెప్పవచ్చు. బడ్జెట్ కు కట్టుబడి ఉంటూ ఆదాయం ఖర్చులకు అనుగుణంగా కారును ఎంచుకోవాలి.

    బోనస్ వస్తే డౌన్ పేమెంట్ లేదా ఈ.ఎం.ఐను పెంచుకోవడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంతో కొత్త కారును కొనుగోలు చేయలేని వాళ్లు స్థోమత ఆధారంగా కారును కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.