https://oktelugu.com/

టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించొచ్చు.. ఎలా అంటే..?

మనలో చాలామంది తరచూ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ముందుగానే రిజర్వేషన్ చేయించుకోకుండా, టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నిరభ్యంతరంగా రైలు ఎక్కవచ్చు. ఫ్లాట్ ఫామ్ ఉన్నవాళ్లు రైలులోకి ఎక్కి ఆ తరువాత టికెట్ తీసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తూ ఉండటం గమనార్హం. భారతీయ రైల్వే చివరి నిమిషంలో రైల్వే స్టేషన్ కు వచ్చిన వారికి ప్రయోజనం చేకూరేలా ఈ అవకాశం కల్పించింది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 16, 2021 / 08:26 PM IST
    Follow us on

    మనలో చాలామంది తరచూ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ముందుగానే రిజర్వేషన్ చేయించుకోకుండా, టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నిరభ్యంతరంగా రైలు ఎక్కవచ్చు. ఫ్లాట్ ఫామ్ ఉన్నవాళ్లు రైలులోకి ఎక్కి ఆ తరువాత టికెట్ తీసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తూ ఉండటం గమనార్హం. భారతీయ రైల్వే చివరి నిమిషంలో రైల్వే స్టేషన్ కు వచ్చిన వారికి ప్రయోజనం చేకూరేలా ఈ అవకాశం కల్పించింది.

    రైల్వే స్టేషన్ కు రిజర్వేషన్ లేకుండా వచ్చే ప్రయాణికులు టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరిన లైన్లలో నిలబడాల్సిన అవసరం ఇకపై ఏ మాత్రం లేదు. యూటీసీ యాప్ ద్వారా లేదా స్టేషన్లలోని వెండింగ్ మెషిన్ల ద్వారా ఫ్లాట్ ఫామ్ టికెట్ ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ సీట్లు అందుబాటులో ఉంటే చేయించుకుని బెర్త్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

    రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో రైలు ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ప్రయాణికులు హైరానా పడనవసరం లేకుండా భారతీయ రైల్వే తెచ్చిన ఈ వెసులుబాటుపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    ఈ నిర్ణయం వల్ల టికెట్ లేకపోవడం వల్ల రైలు మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదని నెటిజన్లు చెబుతున్నారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సులువుగా ఖాళీగా ఉన్న బెర్త్ ను కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.