Car insurance policy : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో అనేక ప్రాంతాలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఏపీలోని విజయవాడలో ఉన్న సింగ్ నగరం పీకల లోతులో నీట మునిగింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోని వస్తువులు తడిసిపోయాయి. అలాగే కార్లు, బైక్ లు నీటిలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి కార్లు నీటిలోనే ఉండిపోయాయి. అయితే చిన్నపాటి వర్షానికే కారు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది రోజుల తరబడి కార్లు నీటిలో ఉంటే చెడిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో కొందరు కారుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నవారు రిలాక్స్ గా ఉంటారు. కానీ ఇన్సూరెన్స్ క్లెయియ్ చేసుకునే విషయంలో ఓ విషయం తెలిసి షాక్ తింటారు. అదేంటంటే?
కారు ఉన్న వారు దాదాపు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వర్షాల కాలంలో కార్లు తడుస్తూ ఉంటాయి. కానీ కొందరు కారు తడవకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు కారు కోసం ప్రత్యేకంగా కవర్ ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు ప్రత్యేకంగా షెడ్డును నిర్మించుకుంటారు. కానీ వరదలు సంభవించినప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే.. కారు నీటిలో చిక్కుకుంటుంది. ఈ సమయంలో కారులోపలి భాగంలోకి నీరు వెళ్తుంది. ఇదే సమయంలో కారు ఇంజిన్ లోకి నీరు వెళ్తుంది. దీంతో ఇంజిన్ లో సమస్యలు వచ్చి కారు పనికిరాకుండా పోతుంది. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇంజిన్ కు సంబందించిన అడిషినల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దీనికి వర్తించదు.
కారు ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే చాలా మంది Comprehensive Car Insurance తీసుకుంటారు. ఇది కారు బాడీ డ్యామేజ్ లేదా పార్ట్స్ పాడైపోతే మాత్రమే వర్తిసుంది. అయితే ఈ ప్లాన్ లో ఇంజిన్ సమస్యలు ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించదు. ఇంజిన్ సమస్య కు కూడా ఇన్సూరెన్స్ వర్తించాలంటే దీని కోసం అదనంగా మరో ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే Engine Protection Cover ను కూడా తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల కారు ఇంజిన్ లో ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారం కోసం డబ్బులు ఇస్తుంది.
అయితే ఇది ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో అదనంగా రూ. 2వేలు చెల్లించి తీసుకోవాలి. కానీ కొంత మంది నిర్లక్ష్యంగా వదిలేస్తారు. ఆ తరువాత వరదల సమయంలో కారు పాడైపోవడం వల్ల బాదపడుతారు. అందువల్ల కారు ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఈ విషయాన్ని అస్సలు మరిచపోవద్దు. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఇంజిన్ లో భారీ సమస్యలు వస్తే దాదాపు రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతంది. అప్పుడు ఆ కారు పనికి రాకుండా పోతుంది. అందువల్ల ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కారుకు సంబంధించి అన్ని విభాలకు వర్తించే కావాల్సిన ఇన్సూరెన్స్ లు చేయించుకోవడం మంచిది. లేదంటే ఏ చిన్న సమస్య వచ్చినా భారీగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి.