https://oktelugu.com/

Prabhas: సినిమాల్లోనే కాదు..విరాళంలో కూడా ప్రభాసే టాప్..వరద బాధితుల కోసం ఎంత విరాళం అందించాడో తెలిస్తే చేతులెత్తి దండం పెడుతారు!

జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ ఖజానాకు చెరో 50 లక్షల రూపాయిలు డొనేషన్ చేసాడు. ఆ తర్వాత సందీప్ కిషన్, విశ్వక్ సేన్, అనన్య నాగేళ్ల వంటి వారు వెంటనే విరాళాలు ప్రకటించారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 4, 2024 / 01:30 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కారణంగా వరదలు ఏ స్థాయి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో గత కొద్దిరోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వరదల్లో విజయవాడ ప్రాంతం సగానికి పైగా మునిగిపోయింది. రోడ్ల మీద నడిచే పరిస్థితులు లేవు, బస్సులు, కార్లు, బైకులు తిరిగే రోడ్ల మీద ఇప్పుడు బొట్లు తిరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున అధికారులు గత నాలుగు రోజుల నుండి నిద్రాహారాలు మానేసి జనాలకు సహాయసహకారాలు అందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన స్టార్ హీరోలు, హీరోయిన్లు నడుం బిగించారు. తమని ఇంత ఆదరించిన జనాలు ఈ స్థాయిలో కష్టపడడం చూసిన హీరోలు తమవంతు సహాయంగా విరాళాలు అందిస్తున్నారు.

    ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ ఖజానాకు చెరో 50 లక్షల రూపాయిలు డొనేషన్ చేసాడు. ఆ తర్వాత సందీప్ కిషన్, విశ్వక్ సేన్, అనన్య నాగేళ్ల వంటి వారు వెంటనే విరాళాలు ప్రకటించారు. నిన్న సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కోటి రూపాయిలు విరాళం అందించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయిల విరాళం అందించాడు. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది. ఈయన చెయ్యి చాలా పెద్దది, విరాళాలు అందించడం లో కానీ, ఆకలి తో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడంలో కానీ ప్రభాస్ కి సాటి ఎవరూ రారు అని మరోసారి నిరూపించుకున్నాడు. కాసేపటి క్రితమే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 కోట్ల రూపాయిలు విరాళం అందించాడు. సినిమాల్లో తన తోటి హీరోలకంటే అత్యధిక వసూళ్లను రాబట్టడం ప్రభాస్ కి అలవాటు గా మారిన అంశం, అలాగే దాన గుణంలో కూడా ఆయన ఇతర హీరోలకంటే టాప్ లో ఉన్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం ఉండే ప్రభాస్ లో ఇలాంటి గొప్ప గుణాలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రభాస్ లో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే, తాను సహాయం చేసిన విషయాన్నీ మూడో కంటికి కూడా తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతాడు.

    ఇతరుల ద్వారా తెలియాల్సిందే కానీ, ప్రభాస్ తాను ఇంత విరాళం అందిస్తున్నానని ఎప్పుడూ బహిరంగంగా చెప్పుకోలేదు. నేడు కూడా అదే చేసాడు. సినిమాల్లో వందల కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్, ఎప్పుడూ అదే స్థాయిలో ఉండాలని, ఇలా నలుగురికి ఆయన ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇలా ఉండగా కల్కి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అవలీలగా చేరిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.