Honda Shine
Honda Shine: తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా ? అయితే హోండా షైన్ 100 బెస్ట్ ఆఫ్షన్ గా ఎంచుకోవచ్చు. హోండా షైన్ 100 అనేది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తయారుచేస్తున్న ఒక ప్రసిద్ధ 100సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్. ఇది భారతదేశంలో చాలా విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. తాజాగా, హోండా సంస్థ షైన్ 100తో సహా పలు OBD2A కంప్లయింట్ హోండా టూ-వీలర్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.5,100 ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ టైం మాత్రమే వర్తిస్తుంది.
Also Read: రిలీజ్‌కు ముందే కార్ల బుకింగ్స్ షురూ..బీఎండబ్ల్యూ, టయోటాకు ఇక కష్టకాలమే?
హోండా షైన్ 100.. OBD2A కంప్లయింట్ మోడల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.67,000గా ఉంది. ఇటీవల OBD2B కంప్లయింట్‌తో కొత్త వెర్షన్ విడుదలైన తర్వాత, ఈ బైక్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ వద్ద రూ.68,767కి చేరుకుంది.తేలికైన బరువు (99 కిలోలు), చిన్న టర్నింగ్ రేడియస్ కారణంగా నగర ట్రాఫిక్‌లో సులభంగా తిప్పవచ్చు.
హోండా షైన్ అప్‌డేటెడ్ వెర్షన్ ఎలా ఉంది?
హోండా షైన్ 2025 మోడల్‌లో పూర్తిగా డిజిటల్ డాష్‌ను అమర్చారు. ఈ అప్‌డేట్‌తో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ డిస్‌ప్లే వంటి అనేక కొత్త ఫీచర్స్ చేర్చబడ్డాయి. హోండా ఈ బైక్‌లో డాష్‌కి సమీపంలో USB టైప్-C పోర్ట్‌ను కూడా అమర్చింది. దీని ద్వారా మొబైల్ ఫోన్‌ను ప్రయాణిస్తున్నప్పుడు కూడా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్‌తో కూడిన సాధారణ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హలోజన్ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి ప్రాథమిక ఫీచర్లను కలిగి ఉంటుంది. కొన్ని మోడళ్లలో కాంబీ-బ్రేక్ సిస్టమ్ (CBS) కూడా ఉంటుంది.
హోండా షైన్ మైలేజ్, పవర్:
హోండా షైన్‌లో అమర్చిన ఇంజిన్ కూడా అప్‌డేట్ చేశారు. దీనికి తాజా OBD-2B ప్రమాణాలు జోడించబడ్డాయి. అయితే, ఇంజిన్ అప్‌డేట్ అయినప్పటికీ ఇది మునుపటిలాగే పవర్, టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో 4-స్ట్రోక్, SI, BS-VI ఇంజిన్ అమర్చబడి ఉంది, ఇది 7,500 rpm వద్ద 7.9 kW పవర్, 6,000 rpm వద్ద 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 55కిలో మీటర్లు. ఈ బైక్ 10.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. దీనిని ఒకసారి పూర్తిగా నింపితే దాదాపు 575 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.