Mad Square Day 1 Collections : భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ పాజిటివ్ టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. కాసేపటి క్రితమే ఆ చిత్ర నిర్మాత నాగవంశీ సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ‘మ్యాడ్’ చిత్రానికి క్లోజింగ్ లో వచ్చిన వసూళ్లు, ‘మ్యాడ్ స్క్వేర్’ కి మొదటి రోజే వస్తున్నాయి. మా బ్యానర్ లో ఈ చిత్రం మరో సంచలనాత్మక చిత్రంగా నిలవబోతుంది అంటూ ఆయన ఎంతో ఆనందంతో చెప్పుకొచ్చాడు. ఈమధ్య కాలం లో సితార ఎంటర్టైన్మెంట్స్ పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. ఇదంతా పక్కన పెడితే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు నడుస్తున్న ట్రెండ్ ని చూసి షాక్ కి గురి అవుతున్నారు ట్రేడ్ పండితులు.
గంటకు 10 నుండి 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి టాప్ IPL టీమ్స్ తలపడుతున్నప్పటికీ ఈ రేంజ్ లో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడడానికి కదులుదాం సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో మొదటి రోజు రెండు లక్షల 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం'(Gunturu Karam) మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ సేల్స్ కౌంట్ కంటే ఎక్కువ అని అంటున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రానికి మొదటిరోజు 2 లక్షల 30 వేల టికెట్స్ అమ్ముడుపోతే, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి రెండు లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు.
ఓవరాల్ గా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ్రాస్ అయితే ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ కావడం తో ఈ చిత్రానికి మొదటి వారంలోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో స్టడీ గా ఉండగలిగితే కచ్చితంగా 150 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. కచ్చితంగా ఈ చిత్రం ఆరంభం నుండి ఎండింగ్ వరకు పొట్టచెక్కలు అయ్యే కామెడీ తో నిండిపోయి ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూలు కట్టొచ్చు, కాబట్టి కచ్చితంగా లాంగ్ ఉండే సినిమా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.