Force Gurkha
Force Gurkha: ఫోర్స్ గూర్ఖా అనేది భారత ఆటోమొబైల్ తయారీదారు ఫోర్స్ మోటార్స్ ఉత్పత్తి చేస్తున్న SUV. ఇది ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ డ్రైవింగ్, కఠినమైన భూభాగాలపై ప్రయాణించడానికి రూపొందించినది. తన స్ట్రాంగ్ నిర్మాణం, పవర్ ఫుల్ ఇంజిన్, 4×4 సామర్థ్యంతో, గూర్ఖా ఆఫ్-రోడ్ వినియోగదారులకు, సాహస యాత్రలు చేసే వారికి ది బెస్ట్ అనిపించుకుంది. ఇటీవల భారత రక్షణ దళాలు కూడా ఈ SUV కెపాసిటీని గుర్తించాయి. తమ వాహన శ్రేణిలో చేర్చుకోవడానికి భారీ సంఖ్యలో ఆర్డర్ ఇచ్చాయి. థార్ వంటి ఇతర ఆఫ్-రోడ్ వాహనాలకు ఇది గట్టి పోటీని ఇస్తోంది.
Also Read: రిలీజ్‌కు ముందే కార్ల బుకింగ్స్ షురూ..బీఎండబ్ల్యూ, టయోటాకు ఇక కష్టకాలమే?
ఫోర్స్ మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత సైన్యం నుంచి గూర్ఖా 2,978 వాహనాలకు ఆర్డర్ లభించింది. ఈ వాహనాలను భారత సైన్యం, భారత వైమానిక దళం రెండింటిలోనూ ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ SUV మిషన్ రెడీ వెహికల్ మంచి కెపాసిటీని కలిగి ఉంటుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫోర్స్ మోటార్స్ తమ గూర్ఖా ఎల్‌ఎస్‌వీ (లైట్ స్ట్రైక్ వెహికల్) ద్వారా అనేక సంవత్సరాలుగా రక్షణ రంగానికి సేవలు అందిస్తోంది. ఫోర్స్ గూర్ఖాను ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్, లోతైన నీటిలో ప్రయాణించే సామర్థ్యం, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం పవర్ ఫుల్ 4×4 డ్రైవ్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఈ SUV ఎడారి నుంచి పర్వతం వరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణించగలదు.
ఫోర్స్ గూర్ఖా రెండు బాడీ ఫార్మ్‌లలో అందుబాటులో ఉంది. 3 డోర్, 5 డోర్ మోడల్‌లు. రెండు మోడళ్లలోనూ 2.6-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంటర్-కూల్డ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 138 bhp పవర్, 320 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు మోడళ్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 4×4 కెపాసిటీ ఉంది. అద్భుతమైన ఆఫ్-రోడింగ్ కోసం ఫ్రంట్ , రియర్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఇందులో లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోర్స్ గూర్ఖా 18-ఇంచుల అల్లాయ్ వీల్స్, 7-ఇంచుల LED డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కొత్త 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్లు మోడల్‌ను కొత్త పవర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ తో పాటు సౌకర్యవంతంగా కూడా చేస్తాయి. 2024లో చేసిన అప్‌డేట్‌లలో భాగంగా 4WD షిఫ్టర్‌ను మాన్యువల్ లివర్ నుంచి మార్చి, ముందు సీట్ల మధ్య షిఫ్ట్-ఆన్-ఫ్లై రోటర్ నాబ్‌ను అందించారు. 5-డోర్ మోడల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ SUV లీటరుకు 9.5కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.