Honda Freed: 25 కి.మీ మైలేజీ.. ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు.. ధర కూడా తక్కువే!!

గ్లోబల్ మార్కెట్‌లోకి ‘ఫ్రీడ్’ ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. విడుదల తేదీతో పాటు ఇతర అప్‌డేట్స్‌ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Written By: Neelambaram, Updated On : July 2, 2024 5:39 pm

Honda Freed

Follow us on

Honda Freed: హోండా కంపెనీ సరికొత్త కారును లాంచ్ చేసింది. దీనికి ‘ఫ్రీడ్’ అని పేరు పెట్టింది. ఇది ఒక కాంపాక్ట్ ఎంపీవీగా ఉండనుంది. పెట్రోల్, హైబ్రిడ్ ఇంధన వేరియంట్లతో ఈ కారు అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఈ కారు ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే అమ్మకానికి పెట్టారు. ఎయిర్, క్రాస్ స్టార్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ అధునాతన కారు త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్‌లోకి ‘ఫ్రీడ్’ ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. విడుదల తేదీతో పాటు ఇతర అప్‌డేట్స్‌ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైమెన్షన్ గత కారు కంటే కొంచెం ఎక్కవగానే ఇచ్చారని తెలుస్తుంది. పొడవు 4,310 మిమీ, వెడల్పు 1,720 మిమీ, ఎత్తు 1,780 మిమీగా ఉండనుంది. దీని వీల్ బేస్ 2,740 మిమీగా ఉంది.

రెండు ఇంధనాలతో ఇది నడుస్తుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది పెట్రోల్ తో.. 1.5-లీటర్ పెట్రోల్ మోటార్ e:HEV హైబ్రిడ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మొదటి ఇంజిన్ 6,600 rpm వద్ద 118 ps గరిష్ట శక్తిని 4,300 rpm వద్ద 142 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సీవీటీ గేర్ బాక్స్ ద్వారా మోటార్ ఈ శక్తిని విడుదల చేస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ మూవ్‌మెంట్ ఆప్షన్‌ను అందించనున్నారు. హైబ్రిడ్ ఫీచర్ ఫ్రీడ్ గరిష్టంగా 123 ps, 253 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2024 హోండా యెన్ ధర 2.508-3.437 మిలియన్ యన్ల మధ్య ఉంది. భారత్‌లో అయితే సుమారు రూ. 13 నుంచి 17 లక్షలుగా ఉంటుంది.

లీటరుకు 25 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నాన్ హైబ్రిడ్ సిస్టమ్ లీటరుకు 16.2 కి.మీ మైలేజీ ఇవ్వనుంది. మైలేజీ పరంగానే కాకుండా టెక్నికల్ ఫీచర్స్ కూడా అద్భుతంగా పొందు పరిచారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ), లేన్ కీప్ అసిస్ట్ (ఎల్కేఏ), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ), హోండా సెన్సింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్, బిగ్‌ సెంట్రల్ టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, బిగ్‌ ఏసీ వెంట్స్ ను అమర్చారు. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక వేరియంట్లలో ఈ కారును అందించనున్నట్లు హోండా తెలిపింది. వీల్ చైర్ సీటును కారులోకి చొప్పించారు. కొత్త హోండా సీట్ ఆప్షన్స్‌, జపనీయులను ఆకట్టుకునే అనేక సాంకేతిక ఫీచర్లతో వస్తుంది. భారత్‌లో ఈ కారు విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.