TT Family Couple: కామెంట్లను పట్టించుకోని ఆ జంట అతిపెద్ద కారును కొన్నది.. ఆ కారు ఖరీదెంతో తెలిస్తే షాక్ కావాల్సిందే?

‘టీటీ ఫ్యామిలీ’ పేరుతో సోషల్ మీడియాలోకి షెమీ, షెఫీ అనే జంట ఎంటరైంది. ఈ అకౌంట్ కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో విపరీతమైన డబ్బు రావడం మొదలైంది.

Written By: Neelambaram, Updated On : July 2, 2024 5:34 pm

TT Family Couple

Follow us on

TT Family Couple: సోషల్ మీడియా అంటే పుకార్లు చేయించడమే కాదు. మధ్య తరగతి వారిని శ్రీమంతులుగా, పేదలను మధ్యతరగతి వారిగా మార్చింది. నేడు దీని ద్వారా పాపులర్ అయిన చాలా మంది కోట్లాది రూపాయలను సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. వ్యూవర్ షిప్ పెరుగుతున్నా కొద్ది లక్షలాది రూపాయలు వచ్చి పడుతుంటాయి. ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనుక్కొని దర్జాగా బతుకుతున్నారు.

‘టీటీ ఫ్యామిలీ’ పేరుతో సోషల్ మీడియాలోకి షెమీ, షెఫీ అనే జంట ఎంటరైంది. ఈ అకౌంట్ కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో విపరీతమైన డబ్బు రావడం మొదలైంది. ఇటీవల లక్షల విలువైన కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వీరు ఏ కారు కొన్నారు? దాని ధర ఎంత వరకు ఉంటుంది? అనే వివరాలను చూద్దాం.

యూట్యూబ్, ఇన్‌ స్టా వీడియోలతో ఫేమస్ అయిన ఈ జంటను కొంత కాలంగా చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కువ వయస్సున్న మహిళను వివాహం చేసుకున్నావని షెమీని విమర్శిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుంటూ వెళ్తోంది.

కేవలం వీడియోస్ చేయడమే కాదు కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లిలో షెమీ బట్టల దుకాణాన్ని కూడా నడుపుతున్నట్లు సమాచారం. ఇటీవల వీరు మారుతి సుజుకి కంపెనీకి చెందినబాలెనొ కొనుగోలు చేశారు. ఈ వీడియోలో జంటతో పాటు వారి కుమార్తె కూడా ఉంది.

భార్య భర్తలు ఇద్దరూ మారుతీ షోరూం చేరుకొని అక్కడి సిబ్బంది నుంచి కారు కీ తీసుకున్నారు. వీరు కొన్నది మారుతి సుజుకి బాలెనొలో టాప్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. రూ.9.88 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం. ఇందులో బేసిక్ మోడల్ ధర రూ.6.66 లక్షలు.

ఈ జంట కొత్త కారు కొన్న సందర్భంగా కొందరు అభినందనలు చెప్తుంటే.. మరొకొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటో లక్షల లైకులు పొందింది. నిజానికి భారతీయ మార్కెట్ లో ప్రజాదరణ పొందిన మారుతి కార్లలో బెలనో ఒకటి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్ లో టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉన్న మారుతీ సుజుకీ బలెనొ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటో మేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ వంటివి బాలెనొ సొంతం. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 90 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ఇంజిన్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉంటుంది.