Homeబిజినెస్JSW Jetour T2 car: డిజైన్ అంటే ఇదే..JSW కొత్త కారు గురించి ఆసక్తిగా చర్చ..

JSW Jetour T2 car: డిజైన్ అంటే ఇదే..JSW కొత్త కారు గురించి ఆసక్తిగా చర్చ..

JSW Jetour T2 car: ప్రముఖ కార్ల కంపెనీ JSW నుంచి కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. అందుకు సంబంధించిన విషయం అధికారికంగా ప్రకటించకపోయి నప్పటికీ.. ఈ కంపెనీ లేటెస్ట్ గా Jetour 2 అనే కారు డిజైన్ పేటెంట్ హక్కుల డిజైన్ ను పొందేందుకు సిద్ధమైంది. చైనా కంపెనీ చెరీ తో ఒప్పందం చేసుకొని తీసుకువస్తున్న ఈ SUV కారు ఆకర్షించే మోడల్స్ లో ఒకటి అవుతుందని భావిస్తుంది. అంతేకాకుండా ఇది హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కావడంతో మైలేజ్ విషయంలో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇంతకీ ఈ కారు ఎలా ఉండబోతుంది అంటే?

JSW కంపెనీకి చెందిన జెటోర్ T2 అనే కారు దీపావళి సందర్భంగా నవంబర్లో విడుదల కావడానికి సిద్ధమవుతుంది. అయితే ఇటీవల రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఒక ఫోటోను రిలీజ్ చేసింది. దీని ప్రకారం కారు ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ కారు పూర్తిగా బాక్సింగ్ డిజైన్తో కూడుకొని ఉంటుంది. దీని LED హెడ్ లాంప్స్ దీర్ఘ చతురస్రాకారంలో ఉండనున్నాయి. టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్స్ తో స్లాప్ సైడ్ ను కలిగే ఉంటుంది. అలాగే ఈ కారు హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో ఉండనుంది. ఇందులో భాగంగా ఈ కారులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 1504 బిహెచ్పి, 220 NM టార్క్ ను రిలీజ్ చేయనుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వ్యవస్థలో పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా పనిచేయనున్నాయి. ఎలక్ట్రిక్ వేరియంట్ లో భాగంగా ఇందులో 26.7 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఈ హైబ్రిడ్ ఇంజన్ లీటర్ ఇంతనానికి 139 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

భారతదేశంలో SUV కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో హైబ్రిడ్ కార్లకు మరింత ఆదరణ ఉండబోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని JSW ఈ కొత్త కారును మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. రోజువారి వినియోగదారులతో పాటు లాంగ్ జర్నీ చేయాలని అనుకునే వారికి ఈ కారు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండడంతో హైబ్రిడ్ ఇంజన్ కలిగిన జెటోర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version