Homeఅంతర్జాతీయంGulf countries anger against America: అమెరికాపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం

Gulf countries anger against America: అమెరికాపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం

Gulf countries anger against America: మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా రాజేసిన నిప్పు ఇప్పుడు గల్ఫ్‌ దేశాలను దహించి వేస్తోంది. అణు కార్యకలలాపాలు ఆపడం లేదని ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు చేస్తోంది. మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసింది. దీంతో ఇరాన్‌ ఆగ్రహంతో ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. అమెరికా స్థావరాలు ఉన్న గల్ప్‌ దేశాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఏడు రోజులుగా చేస్తున్న గల్ఫ్‌ దేశాలతో అల్లాడుతున్నాయి. దుబాయ్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్‌తోపాటు 14 దేశాలపై ఇరాన్‌ దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లోని ఆయిల్‌ రిఫైనరీలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆయిల్‌ ఉత్పత్తి రవాణా నిలిచిపోయింది. అమెరికాతో స్నేహం చేసినందుకు, అమెరికాకు బేస్‌లు ఇచ్చినందుకు ఇరాన్‌ ఈ దాడులు చేస్తుంది. దీంతో గల్ఫ్‌ దేశాలు అమెరికా తీరుపై మండిపడుతున్నాయి.

దాడి నేపథ్యం ఇదీ..
ఫిబ్రవరి 28న ’ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో అమెరికా–ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై సంయుక్త దాడులు చేశాయి. ఇరాన్‌ అణు స్థావరాలు, క్షిపణి కేంద్రాలు లక్ష్యాలుగా పెట్టుకుని, సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణానికి కారణమయ్యాయి. ఇరాన్‌ ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌పై 380 క్షిపణులు, 1480 డ్రోన్లు ప్రయోగించింది.

గల్ఫ్‌ దేశాల ఆగ్రహం..
బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ, యూఏఈ లాంటి దేశాలు బహిరంగంగా మాట్లాడలేదు కానీ, ప్రతినిధులు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి ముందు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇరాన్‌ ప్రతిఘటనలను అడ్డుకోలేకపోయామని, తమ రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయని పేర్కొంటున్నారు. అమెరికా సొంత సైన్యం రక్షణపై దృష్టి పెట్టి, మిత్రదేశాలను విస్మరించిందని ప్రజల్లో కోపం పెరుగుతోంది.

ఇరాన్‌ ప్రతిఘటనల ప్రభావం
డ్రోన్లను అడ్డుకోవడం కష్టతరమని పెంటగాన్‌ అధికారులు అంగీకరించారు. గల్ఫ్‌ దేశాలపై షెహద్‌ డ్రోన్లు దాడి చేస్తూ, ఉక్రెయిన్‌ సాంకేతికత అవసరమని అమెరికా గ్రహించింది. సౌదీ మాజీ గూఢచార ప్రధాని తుర్కి అల్‌ ఫైసల్‌ ’ఇది నెతన్యాహు యుద్ధం’ అని విమర్శించారు.

ప్రస్తుతం యుద్ధం మొదలై వారం దాటింది. ఇప్పుడు దాడులు కాస్త తగ్గుముఖం పట్టాయి. క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం కావడంతో ఇరాన్‌ దాడులు తగ్గించిందని అమెరికా ప్రతినిధులు చెబుతున్నారు. అయితే యుద్ధం నాలుగైదు వారాలు కొనసాగుతుందని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలను టెన్షన్‌ పెడుతోంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version