
త్వరలో దీపావళి పండుగ రానుంది. పండగ సీజన్ కావడంతో స్కూటర్ కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే స్కూటర్ల విక్రయాలు తగ్గాయి. కొత్త స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఏకంగా 11,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశాన్ని హోండా కంపెనీ కల్పిస్తోంది. హోండా యాక్టివా స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది.
అయితే ఈ క్యాష్ బ్యాక్ విషయంలో పలు నియమనిబంధనలు ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ద్వారా యాక్టివా స్కూటర్ కొనుగోలుపై ఏకంగా 11,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. చాలామంది డబ్బులు లేకపోవడం వల్ల స్కూటర్ ను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు స్కూటర్ ధరపై 70 నుంచి 100 శాతం వరకు ఫైనాన్స్ లభిస్తుంది. దీంతో మన దగ్గర నగదు లేకపోయినా స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.
సాధారణంగా ఫైనాన్స్ కంపెనీలు బైక్ ఫైనాన్స్ కోసం ఎక్కువ మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తూ ఉంటాయి. అయితే హోండా యాక్టివా మాత్రం స్కూటర్ల కొనుగోలుపై కేవలం 7.99 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తుండటం గమనార్హం. మొదటి మూడు నెలలు 50 శాతం కంటే తక్కువ ఈఎంఐ చెల్లించే అవకాశం ఉండటం వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
హోండా యాక్టివా కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వాళ్లు 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. పేటీఎం యాప్ సహాయంతో హోండా స్కూటర్ ను కొనుగోలు చేస్తే 5,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం క్యాష్ బ్యాక్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది.