Govt Schemes
Govt Schemes: ప్రస్తుతం మనిషి జీవించడానికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాల్సినవి కూడు, గుద్ధ మరియు నీరు. వీటితోపాటు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజుల్లో ఉదయం నిద్ర లేచి ఉద్యోగానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. దాంతో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఈరోజుల్లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామంది కార్మికులు మరియు కర్షకులు తమకు చేతనైనంత తమ కుటుంబం తమపై ఆధారపడుతున్న నేపథ్యంలో వారికోసం ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అలాగే పేద మరియు మధ్యతరగతి వాళ్లు కూడా ఎంతోకంత తమ కుటుంబం కోసం బీమా చేయించుకోవడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రైతులు, పేదలు, కార్మికులు, కర్షకులు బీమాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. వీళ్లకు బీమా సౌకర్యం అంతంత మాత్రమే ఉంటుంది. ఎవరో ఒకరు వీళ్ళకి చెప్పి ఇన్సూరెన్స్ చేయిస్తే ఎవరో కొంతమందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామంది రైతులకు మరియు కార్మికులకు భీమా రాదు. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరియు కార్మికులకు కూడా భీమా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Aslo Read: అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?
ఈ క్రమంలో ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు రైతులకు మరియు కార్మికులకు అలాగే కర్షకులకు, దిగువ మధ్యతరగతి, పేద కార్మికులకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భాగంగానే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లో ప్రస్తుతం వాళ్లకు అందిస్తుంది. అయితే దీని గురించి పూర్తిగా చెప్పాలి అంటే అసలు ఇన్సూరెన్స్ కు డబ్బులు చెల్లించలేని వారందరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఒక బీమా పథకాన్ని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం రైతులు, కార్మికులు మరియు కర్షకులు తమ ఆధార్ కార్డు తో పాటు ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింక్ అయి ఉండాలి. ఈ బీమా వాళ్లకు వర్తిస్తుంది. అయితే ఈ బీమా వాళ్లకు ప్రమాద బీమా గా వర్తిస్తుందని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు తెలియజేశారు.
Aslo Read: రూ.5 లక్షలకే 8ఏళ్ల వారంటీతో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల
అయితే ప్రమాదాల బారినపడి మృత్యువాత పడిన వారి కుటుంబ సభ్యులకు ఈ రెండు లక్షల బీమా అందుతుంది. ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఈ బీమా కారణంగా రెండు లక్షలు కుటుంబ సభ్యులకు అందిస్తారని వివరించారు. తాజాగా రైతు బజార్లో దాదాపు 150 మందికి పైగా ఈ ప్రమాద బీమాను పొందారని అలాగే ఇతర వినియోగదారులకు కూడా ఈ ప్రమాద బీమా వర్తింప చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రైతు బజారుకు వచ్చి ఎవరైనా సరే ఈ బీమా పొందవచ్చు అని ఆయన తెలియజేశారు. రైతులతోపాటు కార్మికులు కూడా ఈ బీమాను పొందవచ్చు.