Robin Hood Movie: యంగ్ హీరో నితిన్(Hero Nithin) చాలా కాలం తర్వాత ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రంతో ఈ నెల 28 వ తారీఖున మన ముందుకు రాబోతున్నాడు. ఆయన గత రెండు చిత్రాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన చివరి సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల(Venky Kudumula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల(Heroine Srileela) నటిస్తుంది. నితిన్ తో ఆమెకు ఇది రెండవ చిత్రం. టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి, కానీ రీసెంట్ గా విడుదలైన ‘సర్ప్రైజ్’ సాంగ్ మాత్రం యూత్ ఆడియన్స్ ని ఉర్రూతలు ఊగించాయి. అయితే నితిన్ గత రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఈ సినిమాకు తక్కువ బిజినెస్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ బిజినెస్ జరిగింది.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అంటే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని కచ్చితంగా వసూలు చేయాలి అన్నమాట. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సూపర్ హిట్ టాక్ వస్తే అందుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు. కేవలం వీకెండ్ కి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సినిమా విడుదల అయ్యే రోజునే ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కూడా విడుదల అవుతుంది. కాబట్టి ఆడియన్స్ డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్స్ వరకు ప్రభావం చూపొచ్చేమో కానీ, టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ‘రాబిన్ హుడ్’ ని ఎవ్వరూ ఆపలేరు. నితిన్ ‘భీష్మ’ చిత్రానికి ఆరోజుల్లో దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ ని మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ, లేకపోతే ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఉండేది.
అంతే కాకుండా ఈ సినిమాకి రిపోర్ట్స్ కూడా మంచి పాజిటివ్ గానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చొని చూడగల కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారని అంటున్నారు. మరో రెండు రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనున్న ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ చాలా కాలం తర్వాత కామెడీ రోల్ ని ఈ చిత్రం లో చేస్తున్నాడు. ఈ సినిమా నచ్చకపోతే నా పేరుని మార్చేసుకుంటా అంటూ సవాళ్లు కూడా విసిరాడు. మూవీ టీం మొత్తం ఈ చిత్రం పై అంత నమ్మకంతో ఉంది, ఇక నితిన్ కెరీర్ లో ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది అనేది చూడాలి.