8th Pay Commission
8th Pay Commission: దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8 వ వేతన సంఘం గురించి ఒక భారీ ప్రకటన చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగుల జీతం గురించి అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. తమ మూల వేతనంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయమైన పెంపుదలను ఆశిస్తున్నారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ జనవరి నెలలో 8వ వేతన సంఘాన్ని ధ్రువీకరించారు. ఇక అదే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ధ్రువీకరించారు. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎనిమిదో వేతన సంఘం గురించి ఒక భారీ ప్రకటన చేశారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఎనిమిదవ వేతన సంఘం అమలు 36 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు లేదా వారి కుటుంబాలతో పాటు రక్షణ సిబ్బంది అలాగే పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు/కుటుంబ పెంచనల అంచనా సంఖ్యపరంగా వరుసగా రూ. 36.57 లక్షలు మార్చి 1, 2025 నాటికి రూ. 33.91 లక్షలు డిసెంబర్ 31, 2024 నాటికి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సాధించిన పురోగతిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.
Also Read: UPI ద్వారా పే మెంట్లు చేస్తే 1500 కోట్లు మీవే..
అలాగే ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రిత్వ శాఖ, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి వాటాదారులు అందించిన ఇన్పుట్లను కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. వీటితోపాటు ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతం, పెన్షన్, అలవెన్స్, ప్రయోజనాలలో సంబంధిత సవరణ ఉన్న ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ఆర్థిక ప్రభావం అని తెలుస్తుంది. అయితే అన్ని సిఫార్సులు సమర్పించబడిన తర్వాత ఆమోదించబడిన తర్వాత ఇది అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం ఏర్పాటు చేస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Aslo Read: మారుతి, హ్యుందాయ్ దారిలోనే మరో కంపెనీ.. ఏం చేసిందంటే
కానీ దానికి కేటాయించిన కమిషన్ తన నివేదికను ఎన్ని రోజులలో సమర్పిస్తుంది అనే ప్రశ్న అందరిలో నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను దీని గురించి అడిగినప్పుడు ఆమె ప్రభుత్వం ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అయితే నివేదిక ప్రభుత్వానికి సమర్పించడానికి ఎంత సమయం పడుతుందో కాలాన్ని బట్టి నిర్ణయిస్తారు అని తెలుస్తుంది. ఇక ఎనిమిదవ వేతన సంఘ సవరణ సిఫార్సులు జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి అని చెప్తున్నారు.