https://oktelugu.com/

iPhone 15 : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేవలం రూ.23లకే ఐఫోన్ 15.. ఎక్కడ కొనాలంటే ?

ఐఫోన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. దీంతో అప్పు చేసైనా ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తుంటారు.

Written By: , Updated On : February 18, 2025 / 11:26 AM IST
iPhone 15

iPhone 15

Follow us on

iPhone 15 : ఐఫోన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. దీంతో అప్పు చేసైనా ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తెస్తుంది కంపెనీ. అయినా పాత మోడల్స్ కు డిమాండ్ ఉంటూనే ఉంది. ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. అత్యంత చౌకగా ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. 2023లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 15ను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో భారీ డిస్కౌంట్ పై ఐఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఐఫోన్ ను దాదాపు సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. తాజాగా రిలీజ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ తర్వాత అమెజాన్ ఐఫోన్ 15 (128GB, బ్లాక్) ధరను భారీగా తగ్గించింది. ఈ ధర తగ్గింపుతో వినియోగదారులు ఈ ఐఫోన్‌ను తమ బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 మెజాన్ పే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి భారీగా తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ఐఫోన్ 15 (128జీబీ) ధరను రూ. 79,900 నుండి 24% డిస్కౌంట్‌తో ఇది రూ. 60,999కి తగ్గించింది. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కొనుగోళ్లపై 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఇక్కడ వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్చేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ స్థితి, మోడల్‌ను బట్టి రూ.34,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్ ఐఫోన్ 15ని గతంలో కంటే మరింత ఎట్రాక్టివ్ గా చేస్తుంది. దీంతో ఐఫోన్ 15 రూ.23,949లకే లభిస్తుంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్:
ఐఫోన్ 15 ప్రీమియం మెటీరియల్స్‌తో రూపొందింది. ఇందులో సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, అల్యూమినియం ఫ్రేమ్, నీరు, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఉంది. ఇది డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో ఆపిల్ A16 బయోనిక్ చిప్ ఉంది. ఇది 4nm ప్రాసెస్‌తో తయారు చేశారు. ఇది అద్భుతమైన పనితీరును ఇస్తుంది. ఇది 512GB వరకు స్టోరేజీ ఆప్షన్‌తో వస్తుంది. iOS 18.2.1కి మద్దతు ఇస్తుంది. iPhone 15లో 48MP ప్రధాన కెమెరా, 2x టెలిఫోటోతో కూడిన 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 12MP ఫ్రంట్ కెమెరా అధిక-నాణ్యత సెల్ఫీలు, వీడియో కాల్‌లను అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3 ఉన్నాయి. అయితే ఛార్జింగ్ ఎంపికలు వైర్డు, వైర్‌లెస్ రెండింటికి సపోర్ట్ చేస్తాయి.

డిస్ప్లే, డిజైన్: ఐఫోన్ 15 6.1 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. పింక్, ఎలొవ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఈ మోడల్ లో డైనమిక్ ఐలాండ్ నాచ్ ని ప్రవేశపెట్టారు.
బ్యాటరీ జీవితం: “ఆల్-డే బ్యాటరీ లైఫ్” అని ఆపిల్ చెప్పిన ఈ మోడల్, సాధారణ ఉపయోగంతో 9 గంటల వరకు పని చేస్తుంది.
ప్రాసెసర్: ఐఫోన్ 15 ఎ A16 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. ఇది ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లో ఉపయోగించిన A15 చిప్‌కంటే వేగంగా ఉంటుంది.