Siricilla : (Telangana state) తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి (Sircilla district yella Reddy petta mandal racherla gollapalli village) చెందిన దాసరి గణేష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని (Uttar Pradesh state) ప్రయాగ్ రాజ్(prayagraj) లో మహా కుంభమేళాకు (mahakumbh Mela) వెళ్లాడు.. అక్కడ అయోధ్య, త్రివేణి సంగమం, గంగ, యమున , సరస్వతి, సరయు నదులతో పాటు ధర్మపురి గోదావరి నది నుంచి 30 లీటర్ల పవిత్ర జలాన్ని తీసుకొచ్చాడు. ఆ పవిత్ర జలాలను ఊరు మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ డ్రోన్ సహాయంతో చల్లించాడు.. డ్రోన్ ను కిరాయికి తీసుకొని.. గ్రామంలో ఉన్న ప్రధాన వీధులు.. కాలనీలు.. శివారు ప్రాంతాలలో స్ప్రే చేయించాడు.. ఇలా స్ప్రే చేయగా మిగిలిన పవిత్ర జలాన్ని గ్రామంలోని ఆలయాలలో అభిషేకానికి అందించాడు.. గణేష్ చేసిన పనిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
అదే నమ్మకం
ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ వ్యాప్తంగా కోట్ల మంది హాజరవుతున్నారు. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. అయితే భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్ రాజ్ , న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మినహాయిస్తే మహా కుంభమేళా విజయవంతంగా కొనసాగింది.. ఇక చివరి రోజుల్లో అయితే కుంభమేళాకు భారీగా భక్తులు హాజరయ్యారు. రైళ్లు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కుంభమేళాకు హాజరై తిరిగి వచ్చేవారు పవిత్ర జలాలను తీసుకొస్తున్నారు. కలశాలలో నిల్వ చేస్తున్నారు. ఆ జలాలను దేవుళ్ల దగ్గర నిల్వ ఉంచి.. అభిషేకాలు చేస్తున్నారు..
తెలంగాణ నుంచి భారీగా..
తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి మహాకుంభమేళాకు భక్తులు భారీగా వెళ్లారు. వారి ఆర్థిక స్తోమత ఆధారంగా వాహనాలు, రైళ్లు, విమానాలలో వెళ్లారు.. మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. కొంతమంది అయోధ్య వెళ్లారు. బాల రాముడిని దర్శించుకుని పునీతులయ్యారు. అయితే కొంతమంది టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ రైళ్లల్లో జనాలు ఎక్కువగా ఎక్కడంతో.. ఇబ్బంది పడ్డారు. వారు బుక్ చేసుకున్నప్పటికీ.. వేరేవారు ఆ సీట్లల్లో కూర్చున్నారు. జనం రద్దీ అధికంగా ఉండడంతో రైల్వే శాఖ అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో టికెట్లు బుక్ చేసుకుని నిలబడి ప్రయాణించాల్సి వచ్చిందని భక్తులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి గణేష్ కుంభమేళాకు వెళ్లాడు.. అక్కడ పవిత్ర జలాలను తీసుకువచ్చి.. డ్రోన్ సహాయంతో ఊరు మొత్తం స్ప్రే చేశాడు. గ్రామం సుభిక్షంగా ఉండాలని అతడు ఈ పని చేశాడు. #MahaKumbhMela2025 #Telangana pic.twitter.com/uiDk6h8W3n
— Anabothula Bhaskar (@AnabothulaB) February 18, 2025