Prabhas-NTR Movie
Prabhas-NTR : ప్రభాస్, ఎన్టీఆర్ లకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో, కల్కి నార్త్ లో సత్తా చాటాయి. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ప్రభాస్ తో మూవీ అంటే బడ్జెట్ రూ. 500 కోట్లకు పైమాటే. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తాయి. మొన్నటి వరకు పరాజయాలతో ఇబ్బందిపడిన ప్రభాస్ కల్కితో హిట్ ట్రాక్ ఎక్కాడు.
మరోవైపు ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. రామ్ చరణ్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేవర తో సోలో హీరోగా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. దేవర మిక్స్డ్ టాక్ తో కూడా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల వరకు వసూలు చేసింది.
వార్ 2 టైటిల్ తో డైరెక్ట్ హిందీ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. వార్ 2లో హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ తో మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. అమరన్ మూవీతో రాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.
దర్శకుడు రాజ్ కుమార్ ప్రభాస్-ఎన్టీఆర్ లను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. రాజ్ కుమార్ తన కథను వారికి వినిపించాడట. ప్రభాస్-ఎన్టీఆర్ లకు కథ నచ్చిందట. అయితే తమకున్న కమిట్మెంట్స్ పూర్తి అయ్యే వరకు వేచి చూడాలని చెప్పారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్-ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే, అభిమానులకు పండగే అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ప్రభాస్.. రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయాల్సి ఉంది.