Gold Prices: బంగారం కొనుగోలుదారులకు మంచిరోజులు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,350 గా ఉంది.

Written By: Chai Muchhata, Updated On : December 10, 2023 8:51 am

Gold Prices

Follow us on

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి ఇప్పుుడు మంచిరోజులు అని చెప్పవచ్చు. ఆదివారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,350 గా ఉంది. డిసెంబర్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. శనివారం కంటే ఆదివారం బంగారం ధరలు రూ.550 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,500గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,150 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,350 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,890తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,350తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,150తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,350తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు భారీగా వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76000గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి ధరలు రూ.1200 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,000గా ఉంది. ముంబైలో రూ.76,000, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 76,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.