Hardik Pandya
Hardik Pandya: ఇండియన్ క్రికెట్ టీం లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్లేయర్ల లో హార్దిక్ పాండ్య ఒకరు. ఈయన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మీద ఆడిన మ్యాచ్ లో ఆయనకి గాయం అవ్వడంతో మొదట మూడు మ్యాచ్ లకి దూరం అయిన హార్దిక్ పాండ్య ఆ తరువాత టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన గాయం తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మధ్యలో తగ్గినట్టు అనిపించడం తో ఆయన నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు ఇక దాంతో ఆయనకి ఆ గాయం మళ్ళీ తిరగబెట్టింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆ గాయం నుంచి కోలుకోకుండ ఇంకా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇక దాంతో ఆయన టీంలోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అనే దానిమీద సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు వస్తున్నాయి. ఇక దాంతో హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందిస్తూ హార్థిక్ పాండ్య జనవరిలో జరిగే ఆఫ్ఘనిస్తాన్ టి20 సీరీస్ లకు అందుబాటులోకి వస్తాడు అంటూ తెలియజేశాడు.ఇక జనవరి లో ఇండియా ఆఫ్గనిస్తాన్ తో 3 టి20 మ్యాచ్ ల సీరీస్ అదనుంది.
ఇక దాంతో హార్దిక్ పాండ్యా టీంలోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక హార్దిక్ పాండ్య టీమ్ లో లేకపోవడం వల్లే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది అనేది కొంతమంది వాదన…నిజానికి హార్దిక్ పాండ్యా ఉండి ఉంటే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాని కొంతమేరకు అయిన కట్టడి చేసే వాళ్ళం. ఆయన బ్యాటింగ్ లో తన స్టాండర్డ్ ని చూపిస్తూనే, బౌలింగ్ లో కూడా తనదైన రీతిలో బౌలింగ్ చేసేవాడు. అందుకే హార్దిక్ పాండ్య లాంటి ఆల్ రౌండర్ ఇండియన్ టీం లో మరొకరు లేరు కాబట్టి ఆయన ఇండియన్ టీం కి చాలా విలువైన ప్లేయర్ అనే చెప్పాలి.
అలాంటి ప్లేయర్ లేని లోటును ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు కాబట్టి తనకు తాను తొందరగా గాయం నుంచి కోలుకొని ఇండియన్ టీం లోకి తొందరగా రావాలని చాలామంది ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ విషయం పక్కన పెడితే 2024 లో ఆడబోయేటి 20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ చాలా తీవ్రమైన కసరత్తులను చేస్తుంది…