Gold : మన దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువులలో బంగారం(gold) ముందు వరుసలో ఉంటుందంటే అతిశయోక్తి కాక మానదు. మనదేశంలో ప్రజల అవసరాల తగ్గట్టుగా బంగారం ఉత్పత్తి కాదు కాబట్టి.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇక ప్రస్తుతం బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఇంతటి ధర పలకడానికి ప్రధాన కారణం మన దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండడమే. అందువల్లే ఏటికేడు బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2000 సంవత్సరంలో భారత్ లో 10 గ్రాముల బంగారం ధర ₹4,400 ఉండేది. ఆ తర్వాత ఐదు సంవత్సరాలలో ₹3000 పెరిగింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు అంటే 2008లో ప్రపంచ మాంద్యం ప్రభావం వల్ల ₹13వేలకు చేరుకుంది. 2018లో ₹30 వేలకు పెరిగింది. 2020లో ₹50వేల మార్కు అందుకుంది. 2021లో ₹48 వేలకు తగ్గినప్పటికీ.. 2022లో ఏకంగా ₹55వేలకు చేరుకుంది. 2023లో ₹63 వేల మార్కు అందుకుంది. 2024లో ₹78,000 కు చేరుకుంది. ఇప్పుడైతే ఏకంగా ₹90 వేలకు పైగానే ధర పలుకుతోంది. ఇదే ఏడాది చివరికి ₹లక్ష మార్క్ కు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : భారత్ లో ఐఫోన్ ధర రూ.2 లక్షలు? కారణం ఇదే
ఇతర దేశాల నుంచి దిగుమతి
ముందుగానే చెప్పినట్టు బంగారం మనదేశంలో ప్రజల అవసరాల తగ్గట్టుగా ఉత్పత్తి కాదు. కర్ణాటకలోని కోలార్ గనుల్లో(Kolar gold mines) బంగారం ఉత్పత్తి అవుతూ ఉంటుంది.. కే జి ఎఫ్ సినిమా(KGF movie)లో చూపించినట్టుగా ఉండదు కాని.. కాకపోతే ఎంతో కొంత బంగారం మాత్రం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఉత్పత్తి అయిన బంగారం మన దేశ అవసరాలకు తగ్గట్టు సరిపోదు.. 2023లో భారత్ 45 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 3.7 ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో భారత్ స్విట్జర్లాండ్(Switzerland) నుంచి 15.7 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) నుంచి 6.99 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2023లో దక్షిణాఫ్రికా(South Africa) నుంచి 4.82 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని చేసుకుంది. ఇక 2023లో ఆస్ట్రేలియా(Australia) నుంచి 2.35 బిలియన్ డాలర్ల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. 2023లో పెరూ(Peru) దేశం నుంచి 2.26 బిలియన్ డాలర్ల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ఇక మనదేశంలో బంగారంపై మూడు శాతం జీఎస్టీ విధిస్తారు. ఆ తర్వాత తయారు చేసిన ఆభరణాలపై 8 శాతం పన్ను విధిస్తారు. ఇక ప్రపంచ బంగారమండలి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 190.040 మెట్రిక్ టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. 2025 మార్చి 31 నాటికి మన దేశంలో 840.76 టన్నుల బంగారం నిల్వ ఉంది..
Also Read : యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..