YouTube
YouTube : చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత చాలామంది మనుషులతో మాట్లాడడం తగ్గించేశారు. నిత్యం మొబైల్ తోనే గడుపుతున్నారు. విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు క్షణం తీరిక దొరికితే చాలు మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఫోన్ వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ప్రపంచంలో ఏం జరిగినా ఫోన్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. అయితే నిన్నటి వరకు ఏ విషయం అయినా ఒక కథనం లాగా చెప్పేవారు. ఆ తర్వాత వీడియోల రూపంలో చూపించారు. కానీ ఇప్పుడు షార్ట్కు ఎక్కువ డిమాండ్ ఏర్పాటు అయింది. ఎంతో పెద్ద విషయాన్ని షార్ట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే వీటిని ఎక్కువగా చూడటం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అంటే?
సరదా కోసం.. సమస్త సమాచారం కోసం.. షార్ట్ చూడడం ఎక్కువ అయిపోతుంది. ఒక షార్ట్స్లో ఎన్నో విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. ఒక రకంగా ఎక్కువ సమయం వృధా చేయకుండా షాట్స్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అయితే కొందరు వినోదం కోసం కూడా షార్ట్స్ ను ఎక్కువగా చూస్తున్నారు. ఇది రానురాను.. ఒక్కోసారి షార్ట్స్ చూడకపోతే మనసులో ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు కొందరు.. అయితే ఈ షార్ట్స్ ను రెగ్యులర్ గా చూడడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో షార్ట్స్ చూడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అంటే?
Also Read : వీడు మామూలోడు కాదు.. తల్లీకూతుళ్ళను ఒకేసారి గర్భవతులను చేశాడు.. వైరల్ వీడియో
యూట్యూబ్ లో ఉండే షార్ట్స్ వల్ల పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. షార్ట్స్ నిత్యం చూడడం వల్ల పిల్లల మెదడు పై అధిక ఒత్తిడి కలిగి ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ రాట్ అనే జబ్బు వస్తుందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి చిన్న పిల్లల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. వీటితోపాటు షార్ట్స్ చూడడం వల్ల పిల్లల్లో మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు వంటివి పెరుగుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
నిత్యం షార్ట్స్ చూడడం వల్ల పిల్లల్లో కాకుండా పెద్దలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. పెద్దల్లో మైగ్రేన్ వంటి సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మైగ్రేన్ వల్ల తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. అలాగే మైగ్రేన్ వల్ల దీర్ఘకాలంలో అనేక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు షర్ట్స్ ఎక్కువగా చూడటం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు షార్ట్స్ కు దూరంగా ఉండాలని అంటున్నారు.
అయితే సరదా కోసం లేదా సమాచారం తెలుసుకోవడం కోసం 20 నిమిషాల పాటు చూస్తే సరిపోతుందని అంటున్నారు. ఆ తర్వాత 20 నిమిషాలు ఫోన్లు దూరంగా పెట్టాలని అంటున్నారు. అంతేకాకుండా ఫోను 20 మీటర్ల దూరంలో ఉంచి చూడాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఫోన్ ప్రభావం ఎక్కువగా మెదడుపై పడకుండా ఉంటుందని అంటున్నారు. అయితే పిల్లలకి మాత్రం ఫోను తక్కువగా ఇస్తూ వారిని షార్ట్స్ కు వ్యసనంగా మారకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : యూట్యూబ్‌కు 20 ఏళ్లు.. సోషల్ ప్రపంచంలో డిజిటల్ విప్లవం!