Hyundai : హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. హ్యుందాయ్ నెక్సో (Hyundai Nexo) పేరుతో విడుదలైన ఈ మోడల్ సెకండ్ జనరేషన్ కారు. నెక్సో సెకండ్ జనరేషన్ కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్‌తో అనేక మార్పులను సంతరించుకుంది. దక్షిణ కొరియాలో జరుగుతున్న సియోల్ మొబిలిటీ షో 2025లో ఈ కారును ప్రదర్శించారు.
హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కార్లను ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEV) అని కూడా అంటారు. ఈ కార్లు హైడ్రోజన్ వాయువును విద్యుత్ శక్తిగా మార్చి పనిచేస్తాయి. ఈ విద్యుత్ శక్తి ఎలక్ట్రిక్ మోటార్‌ను నడుపుతుంది.. తద్వారా కారు కదులుతుంది. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. అందువల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. కానీ హైడ్రోజన్ కార్లలో అదనంగా ఫ్యూయల్ సెల్ ఉంటుంది, ఇది ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. కొత్త నెక్సో డిజైన్ హ్యుందాయ్ ఇనిషియం కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంది. దీనిని అక్టోబర్ 2024లో లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఆవిష్కరించారు. ఈ కారు ప్రొఫైల్ బాక్సీగా ఉంటుంది.
Also Read : 10 ఏళ్లలో 15 లక్షల యూనిట్లు.. హ్యుందాయ్ క్రెటా సక్సెస్ స్టోరీ!
700 కిమీల అద్భుతమైన రేంజ్
సెకండ్ జనరేషన్ మోడల్ నెక్సో పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఈ SUV రెండు విధాలుగా పవర్ పొందుతుంది. ఇందులో 110 కిలోవాట్ల ఫ్యూయల్ సెల్ స్టాక్ హైడ్రోజన్ నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.64 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఈ కారులో 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కూడా అమర్చబడి ఉంది. హ్యుందాయ్ సంస్థ నెక్సో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని ధీమాగా చెబుతోంది. ఈ కారు గరిష్టంగా గంటకు 179 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు, కేవలం 7.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
అత్యుత్తమ ఫీచర్లు
నెక్సో హ్యుందాయ్ అత్యంత విలాసవంతమైన SUVలలో ఒకటి. దీని ఇంటీరియర్ లేటెస్ట్ టెక్నాలజీతో నిండి ఉంది. లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్‌తో అనుసంధానించబడిన ట్విన్-డెక్ సెంటర్ కన్సోల్ ఉంది. స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ గేర్ సెలెక్టర్ క్రెటా ఎలక్ట్రిక్‌లో ఉన్నట్లుగానే ఉంటుంది. ఇతర హ్యుందాయ్ మోడళ్లలో ఉన్న అన్ని సౌకర్యాలు నెక్సోలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం 12.3 అంగుళాల రెండు డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 14 స్పీకర్లతో కూడిన బాంగ్ అండ్ ఓల్ఫ్‌సెన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ విషయానికి వస్తే, ఈ SUVలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూయర్ మానిటర్, ఎమర్జెన్సీ స్టాప్, నావిగేషన్ బేస్డ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, రియర్ వ్యూ మానిటర్, సరౌండ్ వ్యూ మానిటర్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read : చిన్న కారు అనుకుంటే పొరపాటే.. అమ్మకాల్లో దూసుకెళ్తోంది.. ఇంతకీ ఏ కంపెనీదో తెలుసా..?