Iphone Price : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త రిసిప్రొకల్ టారిఫ్‌లు(Riciprocal tariff) ఏప్రిల్ 2, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ టారిఫ్‌లు భారత్ సహా అనేక దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచుతాయి. దీనివల్ల భారత్‌లో ఐఫోన్(I phone) ధరలు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ తన ప్రసంగంలో భారత్ అమెరికా(America) వస్తువులపై ‘100% కంటే ఎక్కువ‘ సుంకాలు విధిస్తోందని పేర్కొన్నారు, ముఖ్యంగా ఆటోమోటివ్ దిగుమతులపై. దీనికి ప్రతిగా, అమెరికా కూడా భారత ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనుంది.
Also Read : అమెరికా ప్రతీకార సుంకాలు.. భారత్‌పై కీలక నిర్ణయం!
ఆపిల్ ఫోన్‌పై ప్రభావం..
భారత్ ఆపిల్(Apple)కు ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా మారింది. 2017 నుంచి∙ఐఫోన్‌లను ఇక్కడ అసెంబుల్ చేస్తోంది, ఇటీవల ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ వంటి ప్రీమియం మోడల్స్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. అయితే, ఈ టారిఫ్‌ల వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్‌లపై అదనపు ఖర్చు పడుతుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఆపిల్ ఈ ఖర్చును గ్రహిస్తే లాభాలు తగ్గుతాయి, లేదా దాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తే ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 (128GB) భారత్‌లో రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఐఫోన్ 16 ప్రో మాక్స్ (1TB) ధర రూ.1,84,900 వరకు ఉంది. టారిఫ్‌ల ప్రభావంతో, ఈ ధరలు 5–10% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫోన్ ధర రూ.2 లక్షలు
ఐఫోన్ 16 1టీబీ ధర రూ.1.84 లక్షల నుంచి రూ. లక్షలకు చేరే అవకాశం ఉంది. రూ.2 లక్షల ఐఫోన్ ధర రూ.2.1 లక్షల వరకు చేరవచ్చు. ఆపిల్ ఇప్పటికే చైనా నుంచి ఉత్పత్తిని భారత్‌కు మార్చడం ద్వారా ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది, కానీ చైనాపై 34%, భారత్‌పై 26% టారిఫ్‌లతో, ఈ వ్యూహం పూర్తిగా సఫలం కాకపోవచ్చు.
భారత కస్టమర్లపై..
భారత్‌లోని కస్టమర్లకు ఈ ధరల పెరుగుదల పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ తయారైన ఐఫోన్‌లు స్థానిక మార్కెట్ కోసం ఉంటాయి. అయితే, ఎగుమతులపై ఆధారపడే ఆపిల్‌కు ఈ టారిఫ్‌లు సవాలుగా మారవచ్చు. ఈ పరిస్థితి భారత్‌ను తక్కువ ఖర్చుతో కూడిన తయారీ కేంద్రంగా మార్చే అవకాశాన్ని కూడా పరిమితం చేయవచ్చు.