https://oktelugu.com/

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 15న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,890 గా ఉంది. జూన్ 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150తో విక్రయించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 15, 2024 / 07:54 AM IST

    Gold Prices

    Follow us on

    Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి శుభవార్త. కొన్ని రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2999 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 28.88 డాలర్లు పలికింది. దేశీయంగా శనివారం  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 15న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,890 గా ఉంది. జూన్ 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.250 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,040 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,030గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,900 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,890 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,890 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,880తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,890తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,890తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.90,400గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.200 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.90,400గా ఉంది. ముంబైలో రూ.90,400, చెన్నైలో రూ.94,900 బెంగుళూరులో 90,300, హైదరాబాద్ లో రూ. 94,900 తో విక్రయిస్తున్నారు.