Gold Price Fall: బంగారం ధర పెరుగుతుందో, తగ్గుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ రోజు మీరు ఇష్టపడే బంగారం ధర కాస్త తగ్గింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం వల్ల ఈ తరుగుదల కనిపించింది. అటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి కాబట్టి ఈ ధరలపై ప్రభావం చూపాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి మంచి విషయం అన్నమాట. మరి ఈ రోజు అంటే జూన్ 27న హెదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ లో 24 క్యారెట్ బంగారం – గ్రాముకు ₹9,802లు గా ఉంది. 22 క్యారెట్ బంగారం – గ్రాముకు ₹8,985 గా ఉంది. 18 క్యారెట్ బంగారం (999 ప్యూర్ గోల్డ్) – గ్రాముకు ₹7,352లు ఉంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్ బంగారం ధర కాస్త తగ్గింది. అంటే జస్ట్ రూ.93 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే 10 గ్రాములపై రూ.930 తగ్గినట్టు. అటు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై కూడా రూ.850లు తగ్గింది. వెండి ధర కూడా కొంత మేర తగ్గి కాస్త వెండి ప్రియులకు కూడా ఊరటనిచ్చింది. గ్రాముకు వెండి – ₹117.90గా ఉంది. అటు కిలో వెండి – ₹1,17,900గా పలుకుతుంది. వెండి ధరల్లో ఈ స్వల్ప మార్పు పెళ్లిళ్లు, ఆభరణాల కొనుగోలుదారులకు అలాగే పెట్టుబడిదారులకు మంచి సంతోషకరమైన విషయంగా నిలిచింది.
Also Read: Komaki Electric : సైకిల్ ధరకే మోపెడ్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా రోజుకు 80 కి.మీ. ప్రయాణం!
ఇదిలా ఉండగా గడిచిన 10 రోజుల్లో పది గ్రాముల 24 గ్యారెట్ గోల్డ్ పైన రూ.2350లు తగ్గి శుభవార్తగా నిలిచింది. దీంతో చాలా మంది బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ వైపు యుద్ధం ప్రభావం ఉన్నాసరే బంగారం ధరలు తగ్గాయి. అందుకే పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఇలానే కంటిన్యూ అయితే బంగారం ధరలు మరింత తగ్గుతాయి.
భారతీయుల సంస్కృతిలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే చూడటం లేదు. ఈ బంగారాన్ని పెట్టుబడి రూపంగా కూడా పరిగణిస్తున్నారు. పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయడం కచ్చితం అన్నట్టుగా మారుతుంది. దీనికి తోడు బంగారం విలువ కూడా పెరుగుతుంది. ఇవన్నింటి వల్ల బంగారాన్ని భద్రతగా భావిస్తారు. బంగారం ధరలు ప్రతి రోజు మారుతున్నాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ధరలపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలు చేసేవారు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను తెలుసుకొని బంగారం కొనుగోలు చేయడం చాలా అవసరం.
Also Read: India US Bilateral Trade Deal 2025: అమెరికాతో భారత్ బిగ్ డీల్.. ఏమేం ఉండనున్నాయి?
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.