Gold Price Today: కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ తో పాటు వివిధ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరల తగ్గుతున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. ఇన్వెస్ట్ మెంట్ దారుల్లో నిరాశ కలుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆషాఢం అయినా.. బంగారం ధర తగ్గడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 26న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.98,950గా ఉంది. జూన్ 25న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం రూ.1,000 తగ్గింది. అటు 24 క్యారెట్ల బంగారం పై కూడా ఇదే స్థాయిలో తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: IRCTC Refund Rules 2025: రైలు ప్రయాణంలో అసౌకర్యమా.. ఇలా చేస్తే మీ డబ్బులు వాపస్!
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.98,950గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.98,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,950తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గినా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,08,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం ధరల స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,08,000గా ఉంది. ముంబైలో రూ.1,08,000, చెన్నైలో రూ.1,18,000 బెంగుళూరులో 1,08,000, హైదరాబాద్ లో రూ. 1,18,000 తో విక్రయిస్తున్నారు.
Also Read: OYO hidden camera warning: ఓయో రూంలకు వెళ్తున్నారా? ఎందుకైనా మంచిది ఈ వీడియో ఒకసారి చూడండి..
వివిధ దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొనడంతో చాలా మంది బంగారం, వెండిపై పెట్టుబడలు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అలాగే రాజకీయంగా కూడా అనిశ్చితి ఏర్పడడంతో వీటికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత మళ్లీ వీటి కొనుగోలు పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.