Adilabad: ఆదిలాబాద్ నిషాన్ ఘాట్ వాగులో యువకులు గల్లంతు అయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టానికి చెందిన యువకులు నిశాన్ ఘాట్ వాగు వద్ద చేపలు పట్టడానికి వెళ్లారు. వీరిలో ఒక యువకుడు చేపలు పట్టే ప్రయత్నంలో వాగులో గల్లంతయ్యాడు. తోటి యువకుడు అతడిని రక్షించే క్రమంలో అతడు కూడా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ఆదిలాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు
అదిలాబాద్ రూరల్ పోలి స్టేషన్ పరిధిలోని లాండ సాంగ్వి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు వ్యక్తులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు pic.twitter.com/rrAyJSRQFf
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025