Gold Rates : భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువ. ధగధగ లాడే ఆభరణాలను ధరించాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. అయితే గత ఏడాదిగా బంగారం ధరలు ఆకాశాన్నాంటాయి. సంవత్సరం కిందట రూ.50 వేలు పలికిన బంగారం ధర ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది ఈ ఏడాది జూలై 17న బంగారం రూ.80 వేలకు చేరువైంది. ఈ ధరలు లక్ష వరకు చేరుకుంటాయని అందరూ అనుకున్నారు. దీంతో ఇప్పట్లో బంగారం కొనలేమని అనుకున్నారు. కొందరు మహిళలు అయితే బంగారం గురించి దాదాపు మరిచిపోయారు. ఈ తరుణంలో బంగారం ధరలు రోజుకో గుడ్ న్యూస్ చెబుతున్నాయి. దాదాపు వెయ్యి చొప్పున ప్రతీరోజూ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజులగా బంగారం ధరలు ఊహించని రేంజ్ లో పడిపోయాయి. మొత్తంగా రూ.5 వేలకు పైగా తగ్గడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో బంగారం ధరలు కిందికి వస్తున్నట్లు తెలుస్తోంది. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనుగోలు దారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆషాఢ మాసంలో వస్త్రాల కొనుగోలు శక్తి పడిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇప్పుడు పరోక్షంగా బంగారంపై ఆఫర్ వచ్చినట్లయింది. దీంతో దుస్తులతో పాటు బంగారం కొనేందుకు ఎగబడుతున్నారు. అయితే బంగారం కొనుగోళ్లు పెరిగినా ధరలు తగ్గకపోవడం విశేషం. వారంలో బంగారం ఏ రోజు ఎంత తగ్గిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
2024 జూలై 17 వరకు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వచ్చాయి. ఆ మరుసటి రోజు నుంచి బంగారం ధరలు తగ్గడమే కానీ.. పెరగడం లేదు. జూలై 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.68,750 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.75000తో విక్రయించారు. ఆ మరుసటి రోజు అంటే జూలై 18 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. జూలై 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.68,600 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.74,840.. , జూలై 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.68,150 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.74,350.. , జూలై 20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.67,800 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.73,970.. , జూలై 21న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.67,800 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.73,970.. , జూలై 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.67,700 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.73,850.., జూలై 23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.64,950 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.70,860.. ,
జూలై 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.64,950 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.70,860.. , జూలై 25న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.64,000 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.69,820.. , జూలై 26న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.63,000 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.68,730గా నమోదైంది.
అయితే జూలై 27న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.63,250 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.69,000 గా నమోదైంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారు మళ్లీ పెరగకముందే షాపులకు పరుగులు తీస్తున్నారు. వచ్చేది శ్రావణ మాసం కావడంతో పాటు పండగుల సీజన్ వస్తున్నందున బంగారంను ఇప్పుడే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.