Gold price increasing: బంగారం ధరలు మరోసారి గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో లక్షరూపాయలు దాటిన బంగారం ఆ తరువాత తగ్గుతూ వచ్చాయి. దీంతో ఒక దశలో రూ.50 వేల కంటే తక్కువకు బంగారం ధరలు పడిపోతాయని అన్నారు. కానీ అంతగా కాకుండా కాస్త తగ్గుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు రోజురోజుకు బంగారం ధరలు మరోసారి పెరుగుతున్నాయి. ఇలా పెరుగుతూ లక్ష రిమార్క్ దాటింది. శ్రావణమాసం ప్రారంభం అవుతున్న వేళ శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారికి గుబులు పుట్టిస్తోంది. మరి నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: ఈవీలను 100% ఛార్జ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బులియన్ మార్కెట్ ప్రకారం సోమవారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.1,00,050గా నమోదైంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,690గా ఉంది. వెండి ధరలు కిలో రూ.1,25,000గా పలుకుతోంది. బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,050 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,950 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,150 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,800 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,150 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,800 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,050 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,800 పలుకుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,050 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.91,950 పలుకుతోంది.
‘బంగారం’ భయాలు మళ్లీ మొదలయ్యాయి?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంగా పెరిగిన బంగారం ధరలు ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ ఇప్పుడు బంగారం ధరలు పెరుగతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలే బంగారం ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. ఈ సమయంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా బంగారంనకు డిమాండ్ పెరుగుతుంది. ఆన్ లైన్ లో పెట్టుబడులు పెరగడంతోనే బంగారం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాత కారు అమ్ముతున్నారా? ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మంచి రేటు వస్తుంది
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆందోళన వాతావరణం ఏర్పడుతోంది. శ్రావణమాసంలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. దీంతో బంగారం కొనేదెలా? అని కొందరిలో గుబులు పుడుతోంది. అయితే అప్పటి వరకు బంగారం ధరలు తగ్గుతాయా? లేదా మరింతగా పెరుగుతూ ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో శ్రావణమాసం సందర్భంగా బంగారం ధరలు పెరిగాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.