Nani dedication behind movies: ది ప్యారడైజ్(THE PARADISE) చిత్రం కోసం నాని(NANI) ఓ రేంజ్ లో కష్టపడుతున్నారట. ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం నాని 15 రోజుల పాటు 12 గంటలు షూటింగ్ సెట్స్ లో గడిపారట. ఆ ఆసక్తికర సంఘటనలు ఏమిటో చూద్దాం..
ఊరికే గొప్పవాళ్లు అయిపోరు అనే ఓ నానుడి ఉంది. హీరో నానికి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. అసిస్టెంట్ దర్శకుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన నాని.. హీరోగా సక్సెస్ అయ్యారు. అష్టాచెమ్మా చిత్రంతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పరిచయం చేశాడు. స్నేహితుడు, అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ చిత్రాలతో హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం వరుస విజయాలతో టైర్ టు హీరోల జాబితాలో టాప్ లో ఉన్నాడు నాని. మరోవైపు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. వాల్ పోస్టర్ సినిమా పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన నాని… హిట్, హిట్ 2, హిట్ 3, కోర్ట్ చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు.
Also Read: సితార బర్త్ డే వేళ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్… ఆ సీక్రెట్ బయటపెట్టిన సూపర్ స్టార్
కోర్ట్ మూవీ నానికి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నాని విపరీతంగా కష్టపడుతున్నాడట. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఇటీవల చిత్రీకరించారట. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సదరు యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగిందట. ఈ ఫైట్ సీక్వెన్స్ కొరకు నాని 15 రోజుల పాటు 12 గంటలు నిరవధికంగా పనిచేశాడట. ప్రతి రోజు మార్నింగ్ 9 కి వచ్చి నైట్ 9 వరకు సెట్స్ లోనే ఉండేవాడట.
దుమ్ము ధూళితో కూడిన ఆ సెట్ లో నాని 12 గంటలు గడిపాడు అట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విదేశీ స్టంట్ మాస్టర్స్ పనిచేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంపై హైప్ నెలకొంది. నాని లుక్ పూర్తి భిన్నంగా ఉంది. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు.
Also Read: తొలిసారి మీడియా ముందుకు పవన్.. ఏం చెప్పారంటే?
ఇక నాని-శ్రీకాంత్ ఓదెలది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన దసరా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దసరా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా దసరా విడుదల కానుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సోనాలి కులకర్ణి హీరోయిన్ గా నటిస్తుంది.