https://oktelugu.com/

Gautam Adani: ఆసియా కుబేరుడిగా అదాని.. అంబానిని వెనక్కు నెట్టి మరీ..

శుక్రవారం అదానీ గ్రూప్ షేర్లు పెరగడంతో గౌతమ్ అదానీ సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం సంపద 5.45 బిలియన్ డాలర్లు అంటే 45 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 1, 2024 / 06:38 PM IST

    Gautam Adani

    Follow us on

    Gautam Adani: గౌతమ్ అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.18 లక్షల కోట్లు చేరుకోవడంతో అదానీ కూడా ఆసియా రారాజు అయ్యాడు. సంపాదనలో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అవతరించాడు. శుక్రవారం నాడు ప్రపంచంలోని 500 మంది బిలియనీర్లలో గౌతమ్ అదానీ సంపద అత్యధికంగా పెరిగింది. అదానీ సంపద ఐదు బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మరోవైపు ముఖేష్ అంబానీ నికర విలువలో స్వల్ప పెరుగుదల కనిపించింది. టాప్ 12 మంది సంపన్నుల జాబితాలో ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్‌ల సంపద క్షీణించింది.

    గౌతమ్ అదానీ సంపదలో భారీగా పెరుగుదల
    శుక్రవారం అదానీ గ్రూప్ షేర్లు పెరగడంతో గౌతమ్ అదానీ సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం సంపద 5.45 బిలియన్ డాలర్లు అంటే 45 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఆ తర్వాత అదానీ మొత్తం సంపద 111 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత సంవత్సరంలో అదానీ సంపద 26.8 బిలియన్ డాలర్లు పెరిగింది. సోమవారం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దీని కారణంగా గ్రూప్ మార్కెట్ క్యాప్ విపరీతంగా పెరిగింది.

    ఆసియా కిరీటం అదానీదే..
    గౌతమ్ అదానీ సంపద పెరగడంతో, అతను ఇప్పుడు భారతదేశంతో పాటు ఆసియాకు రారాజుగా అవతరించాడు. ముఖేష్ అంబానీని ఒక మెట్టు వెనక్కి నెట్టేశాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ ప్రపంచంలోని 11వ సంపన్న వ్యాపారవేత్తగా నిలిచారు. మరోవైపు ముఖేష్ అంబానీ ఇప్పుడు 12వ స్థానానికి చేరుకున్నారు. ముఖేష్ అంబానీ ప్రస్తుత సంపద 109 బిలియన్ డాలర్లు. శుక్రవారం ముకేశ్ అంబానీ నికర విలువ 76.2 మిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో, ముఖేష్ అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది.

    ఇతర సంపన్నుల మాటేమిటి?
    శుక్రవారం ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్లలో, కేవలం ముగ్గురు బిలియనీర్లు మాత్రమే తమ సంపదలో క్షీణతను చవిచూశారు. ఇందులో ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ అల్లిసన్ పేర్లు ఉన్నాయి. జెఫ్ బోస్ సంపదలో భారీగా క్షీణత కనిపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ సంపద 2.75 బిలియన్ డాలర్లు క్షీణించింది. మొత్తం నికర విలువ 199 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎలోన్ మస్క్ సంపదలో 493 మిలియన్ డాలర్ల క్షీణత ఉంది. ప్రస్తుతం, ఎలోన్ మస్క్ నికర విలువ 203 బిలియన్ డాలర్లు. లారీ ఎల్లిసన్ సంపద $21.7 మిలియన్లకు స్వల్పంగా క్షీణించింది. అతని మొత్తం సంపద $132 బిలియన్లకు చేరుకుంది.