DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. ఈ పెంపు 2024 జనవరి ఒకటో తేదీ నుంచే వర్తించనుంది. ఇది ఉద్యోగులకు ఎంతగానో మేలు చేకూర్చనుంది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను పెంచింది. డీఏ 4 శాతం పెంపు తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మూలవేతనంలో 50 శాతంగా ఉంది. అప్పటి నుంచి రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీతో సహా ఇతర అలవెన్సులు పెరుగుతాయని భావించారు. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) పెంపు కారణంగా, ప్రభుత్వ ఉద్యోగులకు అనేక అలవెన్సులు పెరిగాయి, ఇందులో రిటైర్మెంట్ గ్రాట్యుటీ కూడా ఉంది.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా డీఏ సవరణలు జనవరి, జులైలో చేపడుతుంది. ఏటా మార్చి, సెప్టెంబర్ లో దీనిపై ప్రకటన చేస్తుంది. అయితే, అమలు చేసేది మాత్రం జనవరి, జూలై నెలల నుంచే కావడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే విషయమే.
ప్రయోజనాలు పొందేది వీరే..
2024 జనవరి ఒకటో తేదీ తర్వాత ఉద్యోగ విరమణ పొందే వారు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఇంతకుముందు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది ఎన్డీఏ సర్కారు. దీని తర్వాత వారి డీఏ 50 శాతానికి పెరిగింది. ఇంతకుముందు, గ్రాట్యుటీ పెంపునకు సంబంధించి గత ఏప్రిల్ 30న అదే ప్రకటన వెలువడగా, మే 7న నిలిపివేసింది.
గ్రాట్యుటీ అనేది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరంతరం పని చేయడానికి కంపెనీ ఇచ్చే పథకం. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 ప్రకారం, ఒక ఉద్యోగి కనీసం ఐదేళ్లపాటు ఒక సంస్థలో పనిచేస్తే, అతను గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందేందుకు అర్హుడు.
మార్చిలో డీఏ పెంపు
అంతకుముందు మార్చి నెలలో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచింది. ఆ తర్వాత డీఏ 50 శాతం అయింది. ఈ పెరుగుదల తర్వాత, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందుతున్నారు.