https://oktelugu.com/

AP Elections 2024: ఆ సర్వేల్లో టిడిపి కూటమికి ఛాన్స్!

జనగళం ఎగ్జిట్ పోల్ సంస్థ తన ఫలితాలను ప్రకటించింది. టిడిపి కూటమికి 104 స్థానాలు దక్కే అవకాశం ఉందని .. మరో 14 సీట్లలో ఎడ్జ్ కనిపిస్తోందని స్పష్టం చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 1, 2024 / 06:31 PM IST

    AP Elections 2024

    Follow us on

    AP Elections 2024: ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వైసీపీకి జై కొట్టగా.. మరికొన్ని టిడిపి కూటమికి అనుకూల ఫలితాలు ప్రకటించాయి. దీంతో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కు దగ్గరగా ఉంటాయా? లేవా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఫలితాలు ఇస్తుండడం విశేషం. దీంతో పార్టీల శ్రేణులు, సామాన్య జనాలు సైతం ఒక రకమైన కన్ఫ్యూజ్ తో ఉన్నారు. ఏ ఎగ్జిట్ పోల్ కు నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అవి ఈ విధంగా ఉన్నాయి.

    జనగళం ఎగ్జిట్ పోల్ సంస్థ తన ఫలితాలను ప్రకటించింది. టిడిపి కూటమికి 104 స్థానాలు దక్కే అవకాశం ఉందని .. మరో 14 సీట్లలో ఎడ్జ్ కనిపిస్తోందని స్పష్టం చేసింది. అలాగే వైయస్సార్సీపి 44 స్థానాల్లో క్లియర్ కట్ విజయం సొంతం చేసుకోనుందని.. మరో 13 స్థానాల్లో ఆ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోందని స్పష్టం చేసింది.

    ఇక పీపుల్స్ పల్స్ సంస్థ సైతం ఏపీలో టీడీపీ కూటమిదే విజయం అని తేల్చింది. టిడిపి ఒక్కదానికే 95 నుంచి 110 స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోందని స్పష్టం చేసింది. వైసీపీకి 45 నుంచి 60 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని.. జనసేన 14 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటుందని.. బిజెపికి రెండు నుంచి ఐదు స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది. ఓవరాల్ గా టిడిపి కూటమిది ఘనం విజయమని తేల్చింది.

    ప్రిజం సర్వే సంస్థ సైతం టిడిపి కూటమి ఘన విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. కూటమికి 110 నుంచి 115 స్థానాలు దక్కవచ్చని స్పష్టం చేసింది. అందులో జనసేనకు 14, బిజెపికి రెండు స్థానాలు కట్టబెట్టింది. వైసిపి 65 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు మిశ్రమ ఫలితాలు ఇస్తుండడం మాత్రం విశేషం.