Foldable vs Flip Phone:స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎన్నో కొత్త, ప్రత్యేకమైన డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫోల్డబుల్, ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు రకాల స్మార్ట్‌ఫోన్‌లు చూడటానికి భిన్నంగా ఉంటాయి. వాటి పనితీరు కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ, వాటికి కొన్ని ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. మీరు సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్ లేదా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్ల మధ్య తేడాలేమిటో తెలుసుకుందాం.
Also Read : ఐఫోన్ vs ఆండ్రాయిడ్ కెమెరా: ఫొటోగ్రఫీకి ఏది బెస్ట్?
ఫోల్డబుల్ ఫోన్ల ప్రయోజనాలు, నష్టాలు
ఫోల్డబుల్ ఫోన్‌లను మధ్యలో లోపలికి మడవవచ్చు. వీటిని ఓపెన్ చేసినప్పుడు పెద్ద టాబ్లెట్ లాంటి డిస్‌ప్లేగా మారుతాయి. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్ ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌లకు ఉదాహరణ.
ప్రయోజనాలు:
వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి లేదా డాక్యుమెంట్లు చదవడానికి అనువైన పెద్ద స్క్రీన్. మల్టీటాస్కింగ్ సులభం. ఒకేసారి 2-3 యాప్‌లను ఉపయోగించవచ్చు.
నష్టాలు:
సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే వీటి ధర కాస్త ఎక్కువ. స్క్రీన్ కొంచెం సున్నితంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉపయోగించకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇవి కొంచెం బరువుగా, మందంగా ఉంటాయి.
ఫ్లిప్ ఫోన్ల ప్రయోజనాలు, నష్టాలు:
ఫ్లిప్ ఫోన్‌లు పాతకాలపు ఫ్లిప్ మొబైల్స్ లాగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఇవి స్మార్ట్‌ఫోన్ వెర్షన్‌లో మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని పైనుండి క్రిందికి చిన్నగా మడవవచ్చు. దీంతో వీటిని జేబులో పెట్టుకోవడం సులభం. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్, మోటరోలా రేజర్ వంటి ఫ్లిప్ స్టైల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలు:
చిన్న, స్టైలిష్ డిజైన్. జేబులో సులభంగా సరిపోతాయి. కొన్ని మోడళ్లలో కవర్ డిస్‌ప్లే ఉంటుంది, దీని ద్వారా ఫోన్ తెరవకుండానే నోటిఫికేషన్‌లు చూడవచ్చు.
నష్టాలు:
స్క్రీన్ మడత కారణంగా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. సాధారణ ఫోన్ల కంటే వీటి ధర ఎక్కువ.
ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లు సాధారణ ఫోన్ల కంటే బెటరా?
ఫీచర్ల పరంగా ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లు సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ ఫోన్‌లలో అనేక ప్రత్యేకమైన ఫీచర్లు చూడవచ్చు. మల్టీటాస్కింగ్, స్టైలిష్ డిజైన్, ఆవిష్కరణలకు ఇవి మంచి ఉదాహరణ. కానీ, వాటి మన్నిక, స్థిరత్వం, ధర అందరి బడ్జెట్‌కు సరిపోవు.
సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ కాలం మన్నుతాయి, బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంటాయి. వాటి కెమెరా, బ్యాటరీ, పనితీరు ఫోల్డబుల్ లేదా ఫ్లిప్ ఫోన్‌ల కంటే తక్కువ కాదు. మీ బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీరు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read : ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ.. పాడైతే కొత్త ఫోన్ కొనేంత ఖర్చు చేయాల్సిందే !