iPhone vs Android: ఐఫోన్, ఆండ్రాయిడ్ కెమెరాల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు మెగాపిక్సెల్‌లు లేదా కెమెరా లెన్స్‌ల వరకు మాత్రమే పరిమితం కాకుండా, ధర, నాణ్యత, ఇతర అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ కెమెరాల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఫొటోలు, వీడియోల కోసం ఐఫోన్, ఆండ్రాయిడ్‌లలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Also Read : తక్కువ ధరలో ఫోన్ లు పాకిస్తాన్ లో లభిస్తాయా? లేదా ఇండియాలోనా?
ఇమేజ్ ప్రాసెసింగ్
ఐఫోన్: ఐఫోన్ అతిపెద్ద బలం దాని ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఫోటో తీసిన తర్వాత, దాని రంగు, బ్రైట్ నెస్, వివరాలు, బ్యాలెన్స్‌ను ఐఫోన్ చాలా సహజంగా సెట్ చేస్తుంది. ఫోటో సహజంగా కనిపిస్తుంది, ఎక్కువ ప్రకాశవంతంగా లేదా ఎక్కువ ఎడిట్ చేసినట్లుగా కనిపించదు. నేచురల్ ఫోటో వస్తుంది.
ఆండ్రాయిడ్: శాంసంగ్, వివో, షియోమీ వంటి అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఫోటోను తీసిన వెంటనే మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా చేస్తాయి. ఇది ఫోటోను అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ కొన్నిసార్లు చాలా కృత్రిమంగా కూడా అనిపిస్తుంది.
వీడియో క్వాలిటీ
ఐఫోన్: ఐఫోన్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ చాలా స్థిరంగా, వృత్తిపరమైన స్థాయిలో ఉంటుంది. దీని సినిమాటిక్ మోడ్, 4K రికార్డింగ్, ఆడియో క్యాప్చర్ అద్భుతంగా ఉంటాయి. వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్స్ దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.
ఆండ్రాయిడ్: శాంసంగ్ గెలాక్సీ S, గూగుల్ పిక్సెల్ వంటి కొన్ని హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు మంచి వీడియోలను రికార్డ్ చేస్తాయి. కానీ చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఐఫోన్ వలె స్టెబిలిటీ ఉండదు.
కెమెరా యాప్, కస్టమర్ ఎక్సీపీరియన్స్
ఐఫోన్: కెమెరా యాప్ యూజర్ ఫ్రెండ్లీ, సింపుల్, ఫాస్ట్ గా ఉంటుంది. ఎక్కువ సెట్టింగ్‌లు లేకుండా వెంటనే ఫోటో లేదా వీడియో తీసుకోవచ్చు.
ఆండ్రాయిడ్: ఆండ్రాయిడ్ ఫోన్ బ్రాండ్‌లను బట్టి కెమెరా యాప్‌లో తేడా ఉంటుంది. కొన్నిసార్లు ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఇంటర్‌ఫేస్ కొంచెం కష్టంగా ఉండవచ్చు.
నైట్ మోడ్, HDR:
ఐఫోన్: ఐఫోన్ నైట్ మోడ్ సహజంగా కనిపిస్తుంది. ఇందులో ఫోటోలోని వివరాలు స్పష్టంగా ఉంటాయి, ఫోటో స్పష్టంగా వస్తుంది.
ఆండ్రాయిడ్: పిక్సెల్ లేదా శాంసంగ్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్‌లు నైట్ మోడ్‌లో చాలా బాగా పనిచేస్తాయి. కానీ కొన్ని చౌకైన ఫోన్‌లలో నైట్ మోడ్ ప్రకాశవంతంగా మాత్రమే ఉంటుంది. దీని కారణంగా వివరాలు తగ్గుతాయి.
మంచి కెమెరా క్వాలిటీ కావాలంటే ఐఫోన్ కొనుగోలు చేయాలి.. ఐఫోన్ రేటు ఎక్కువ కాబట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఏ కంపెనీ ఫోన్ మంచి కెమెరాను అందిస్తుందో దానిని కొనుగోలు చేయండి.
Also Read : ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ.. పాడైతే కొత్త ఫోన్ కొనేంత ఖర్చు చేయాల్సిందే !