https://oktelugu.com/

Flipkart: మొబైల్ ఫోన్లపై బంఫర్ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

Flipkart: ఆన్ లైన్ షాపింగ్ చేయాలనుకునేవారు Flipkart ను ఎక్కువగా ఫాలో అవుతారు. పండుగలు, ప్రత్యేక సందర్భంగా ఈ సంస్థ ఆఫర్లు ప్రకటిస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 3, 2024 / 10:10 AM IST

    Flipkart announces bumper offers on mobile phones

    Follow us on

    Flipkart: ఈ మధ్య ఆన్ లైన్ షాపింగ్స్ ఎక్కువయ్యాయి. తక్కువ ధరతో పాటు కొన్ని సందర్భాల్లో కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించడంతో చాలా మంది ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఆన్ లైన్ వైపే వెళ్తున్నారు. లేటేస్టుగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart ‘బిగ్ బచాత్ డేస్ సేల్’ పేరుతో మొబైల్ ఫోన్లపై బంఫర్ ఆఫర్లు ప్రకటించింది. కొన్ని కంపెనీ ఫోన్లను తక్కువ ధరకే ఇస్తుండగా.. మరికొన్నింటిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆన్ లైన్ షాపింగ్ చేయాలనుకునేవారు Flipkart ను ఎక్కువగా ఫాలో అవుతారు. పండుగలు, ప్రత్యేక సందర్భంగా ఈ సంస్థ ఆఫర్లు ప్రకటిస్తుంది. అయితే సాధారణ రోజుల్లోనూ సేల్స్ ను పెంచుకునేందుకు వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి పండుగల సీజన్ లేకపోయినప్పటికి ‘బిగ్ బచాత్ డేస్ సేల్’ పేరుతో మొబైల్స్ పై ఆఫర్లకు ప్రకటించిది.

    ఈ సేల్స్ లో భాగంగా Vivo ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించంది. ఈ కంపెనీకి చెందిన Vivo T3 X 5G ఫోన్ ధర సాధారణంగా రూ.13,499 ఉంది. దీనిపై ప్రస్తుతం రూ.1000 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. అయితే ఇది ఇన్ స్టంట్ డిస్కౌంట్. అంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్న వారు నెలకు రూ.836తో మొబైల్ ను కొనుగోలు చేసేవారికి ఈ వెయ్యి డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ మొబైల్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో పాటు 128 జీబీ స్టోరేజీని కలిగి ఉంది. దీని డిస్ ప్లే 6.72 హెచ్ డీ తో ఉంది.

    షావోమీ ఫోన్ పై కూడా Flipkart ఆఫర్ ప్రకటించింది. xiaomi 14 civi వాస్తవ ధర రూ.42,99గా ఉంది.దీనిని HDFC Credit Card తో కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో 6.55 అంగుళాల డిస్ ప్లే తో పాటు 8 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ర్యామ్ 12 జీబీ కాగా, స్టోరేజ్ 512గా ఉంది. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

    మోటారొలా ఫోన్లకు ఆదరణ ఎక్కువే. Motorola Edge 50 pro ఫోన్ రూ.35,300తో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.2 వేల డిస్కౌంట్ లభించనుంది. దీనిని నో కాస్ట్ ఈ ఎంఐతో కొనుగోలు చేసే అవకాశం ఉవంది. అయితే ఈ ఫోన్ ఎక్చేంజ్ ఆఫర్ ను కూడా ప్రకటించారు. ఇందులో 6.7 అంగుళాల డిస్ ప్లే తో పాటు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది.