Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ తో బాలయ్య ఎన్టీయార్ కి చెక్ పెట్టబోతున్నాడా..?

Nandamuri Mokshagna: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మొత్తానికైతే ఇండస్ట్రీకి ఎలా వచ్చాము అనే దానికన్నా టాలెంట్ ఉందా లేదా అనేది....

Written By: Gopi, Updated On : July 3, 2024 10:04 am

Is Balayya going to check NTR with Mokshajna entry

Follow us on

Nandamuri Mokshagna: సినిమా ఇండస్ట్రీలో నట వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు కూడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే కావడం విశేషం…అయితే ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు హీరోలుగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం వాళ్ళకంటూ టాలెంట్ ఉండాలి. అలాగే స్వతహాగా వాళ్ళు ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోగలిగాలి. అలాంటప్పుడు మాత్రమే ప్రేక్షకులు వాళ్ళను ఆదరిస్తారు.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మొత్తానికైతే ఇండస్ట్రీకి ఎలా వచ్చాము అనే దానికన్నా టాలెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ కీలకపాత్ర వహిస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి…ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా వదిలిన మోక్షజ్ఞ ఫోటో చూస్తుంటే తన అద్భుతమైన మేకవర్ తో చూడగానే హీరో మెటీరియల్ అనిపించేలా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు రావడం వల్ల బాలకృష్ణ కూడా తన కొడుకుని స్టార్ హీరోగా చేసి నందమూరి మూడోవ తరం నట వారసుడిగా మోక్షజ్ఞ నే నిలపాలనే దృష్టితోనే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కసరత్తులు చేస్తున్నాడు. ఇక దాని కోసమే కొంచెం లేట్ అయిన పర్లేదు గాని మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దాని కోసమే విపరీతంగా కథలను వింటూ ఏ కథను ఫైనల్ చేయాలి అనే దృష్టిలోనే బాలయ్య బాబు ప్రస్తుతం అలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రి కోసం పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్న బాలయ్య ఇద్దరు ముగ్గురు దర్శకులను ఫైనల్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళలో ఎవరితో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…