CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం

అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తారన్నది ఒక ఆరోపణ. 2019 ఎన్నికల్లో ఓటమికి అదో కారణం కూడా. రాత్రి వరకు సమీక్షలు, సమావేశాలతో అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. వేళా పాలా లేకుండా వారితో పనులు చేయించుకోవడంతో ఆ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది.

Written By: Dharma, Updated On : July 3, 2024 10:13 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: పాలనాపరమైన అంశాల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పనులు, ఇంకోవైపు పోలవరం, అమరావతి విషయాల్లో నిరంతర సమీక్షలు, సమావేశాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సాధారణ పరిపాలనపై సైతం దృష్టిసారించారు. ప్రభుత్వం చేపట్టి నెల రోజులు కాకమునుపే చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత వారు విధుల నుంచి ఇంటికి చేరేలా చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు తరువాత సమావేశాలు పెట్టకూడదని ఇప్పటికే మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తారన్నది ఒక ఆరోపణ. 2019 ఎన్నికల్లో ఓటమికి అదో కారణం కూడా. రాత్రి వరకు సమీక్షలు, సమావేశాలతో అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. వేళా పాలా లేకుండా వారితో పనులు చేయించుకోవడంతో ఆ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. 2014 నుంచి 2019 మధ్య ఉద్యోగ వర్గాలకు చంద్రబాబు సర్కార్ అన్ని రకాల రాయితీలు, సౌకర్యాలు కల్పించింది. కానీ కేవలం పనితీరు కారణంగానే చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత పెంచుకున్నారు ఉద్యోగ వర్గాలు.అందుకే ఈసారి చంద్రబాబు ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతం మాదిరిగా తప్పిదాలు జరగకుండా చూస్తున్నారు.

సాయంత్రం 6:00 దాటిన తర్వాత సమీక్షలు నిర్వహించవద్దని అటువంటి మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెలి కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ వంటి వాటి విషయంలో కూడా సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా మరో ఆదేశం ఇచ్చారు. ఎటువంటి సమీక్ష అయిన 30 నిమిషాల్లో ముగించాలని… సుదీర్ఘ సమయం సమీక్షించవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రహదారుల సమస్యపై నిన్ననే సమీక్షించారు చంద్రబాబు. కేవలం 30 నిమిషాల పాటు సమీక్షకు కేటాయించారు. అధికారులు కూడా ఏం చెప్పాలనుకున్న 20 నిమిషాల్లో సమీక్షలు ముగించాలని సీఎం ఆదేశించారని తెలుస్తోంది. మొత్తానికైతే గత అనుభవాల దృష్ట్యా గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు.. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని భావిస్తుండడం విశేషం.