https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలివే..?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈపీఎఫ్ విత్‌డ్రాయెల్స్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ వరకు ఈపీఎఫ్‌వో కీలక మార్పులు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలను తెలుసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు 2020 సంవత్సరంలో పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకున్నా ఈ సంవత్సరం కూడా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోయి నెలరోజుల కంటే ఎక్కువ అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 19, 2021 / 09:53 AM IST
    Follow us on

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈపీఎఫ్ విత్‌డ్రాయెల్స్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ వరకు ఈపీఎఫ్‌వో కీలక మార్పులు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలను తెలుసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు 2020 సంవత్సరంలో పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకున్నా ఈ సంవత్సరం కూడా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

    ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోయి నెలరోజుల కంటే ఎక్కువ అయితే పీఎఫ్ ఖాతానుంచి ఏకంగా 75 శాతం డబ్బులు వెనక్కు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతా క్లోజ్ చేసుకోకుండానే ఈ మొత్తం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఏదైనా కారణం వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారో వాళ్లు పీఎఫ్ ఖాతా నుంచి కోవిడ్ అడ్వాన్స్ కింద డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

    కంపెనీ నుంచి పీఎఫ్ సెటిల్‌మెంట్ కానివాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు. ఈపీఎఫ్‌వో ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ బెనిఫిట్‌ను గతంతో పోలిస్తే భారీగా పెంచింది. ఈ బెనిఫిట్ గతంలో 6 లక్షల రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 7 లక్షల రూపాయలకు పెరగడం గమనార్హం. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ మరణించిన పక్షంలో నామినీ డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది.

    పీఎఫ్ ఖాతను కలిగి ఉన్నవాళ్లు యూఏఎన్‌తో ఆధార్ నంబర్ ను కచ్చితంగా లింక్ చేసుకోవాలి. అలా చేసుకోని పక్షంలో కంపెనీ కంట్రిబ్యూషన్ డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమ కావడం జరగదు. సెప్టెంబర్ 1లోపు ఆధార్, పీఎఫ్ అకౌంట్ లింక్ చేసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్ ను పొందవచ్చు.