https://oktelugu.com/

Kalki Mahesh Babu : కల్కిలో మహేష్ బాబు నటిస్తే 2000 కోట్లు వసూలు చేసేది, అందుకు ముఖం చూపించలేదా, డైరెక్టర్ సంచలన కామెంట్స్

బాహుబలి 2 అనంతరం ప్రభాస్ కి కల్కి రూపంలో భారీ హిట్ పడింది. ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే కల్కి చిత్రంలో మహేష్ బాబు నటించి ఉంటే రెండు వేల కోట్లు వసూలు చేసేదన్న మాటకు దర్శకుడు నాగ్ అశ్విన్, అవునని సమాధానం చెప్పాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2024 / 06:21 PM IST

    kalki mahesh babu

    Follow us on

    Kalki Mahesh Babu : బాహుబలి 2తో ప్రభాస్ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ కి వరుస ప్లాప్స్ పడ్డాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. సలార్ పర్లేదు అనిపించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ స్థాయి మూవీ అయితే పడలేదన్న వాదనల మధ్య విడుదలైన కల్కి 2898 AD భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.

    దర్శకుడు నాగ్ అశ్విన్ మహాభారత గాథతో ముడిపెట్టి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చేశాడు. కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ వంటి భారీ క్యాస్ట్ నటించారు. ఈ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన గెస్ట్ రోల్స్ ఆకట్టుకున్నాయి. చాలా మంది ప్రముఖులు, స్టార్స్ చిన్న చిన్న పాత్రలు చేశారు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్, దుల్కర్ సల్మాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడు పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.

    కాగా ఈ చిత్రంలో కృష్ణుడు పాత్ర కూడా ఉంది. కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథి గా శ్రీకృష్ణుడు వ్యవహరించాడు. పాండవుల విజయంలో కీలక పాత్ర వహించాడు. కాగా కల్కి మూవీలో శ్రీకృష్ణుడు పాత్ర ఉంది. కానీ ఆ పాత్ర చేసిన వ్యక్తి ముఖం రివీల్ చేయలేదు. కృష్ణ కుమార్ అనే నటుడు ఈ పాత్ర చేశాడు. అయితే కల్కి మూవీలో శ్రీకృష్ణుడు పాత్ర ముఖాన్ని చూపించాలని భావించలేదని నాగ్ అశ్విన్ అన్నారు.

    ఇక కల్కి లో కృష్ణుడు పాత్రకు తన ఛాయిస్ మహేష్ బాబు అన్నారు. మహేష్ బాబు శ్రీకృష్ణుడు పాత్ర చేసి ఉంటే మూవీ రూ. 2000 కోట్లు వసూలు చేసేదని యాంకర్ అనగా… అవునని నాగ్ అశ్విన్ సమాధానం చెప్పారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో చేయకపోవడం వలనే కల్కిలో కృష్ణుడు పాత్ర ముఖాన్ని రివీల్ చేయలేదని అర్థం అవుతుంది. ఇక మహేష్ నటించిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ కి ఖలేజా చాలా ఇష్టం అట.