Electric Car : కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ప్రయాణించడానికి అలవాటు పడ్డారు. దీంతో కాస్త బడ్జెట్ ఉన్నవారు సొంతంగా కారు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల డీజిల్, పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రికల్ వెహికిల్స్ (ఈయూ) ల జోరు నడుస్తోంది. ఇవి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ మారుతి లాంటి కంపెనీలు మాత్రం సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా ఉత్పత్తిని చేస్తున్నాయి. లేటేస్టుగా మారుతి నుంచి ఓ మోడల్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే ‘రెన్ క్విడో’, ‘మారుతి సుజుకీ వ్యాగనార్’. ఈ మోడళ్లుత్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీని గురించి తెలుసుకుందాం..
Renault Kwid ఫీచర్స్ విషయానికొస్తే 999 సీసీ ఇంజన్ తో 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఫూయల్ ను కూడా కలిగిన ఇందులో 5గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం దీనిని రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Maruthi Suzuki Wagnar: మారుతి సుజుకీ కంపెనీ నుంచి త్వరలో మరో ఎలక్ట్రికల్ మోడల్ విడుదలవుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం దీని ఉత్పత్తిని ప్రారంభించి 2025లో మార్కెట్లోకి తీసుకొస్తారని అంటున్నారు. ఈ కారు ధర రూ.8.5 లక్షల వరకు విక్రయించే అవకాశాలుంటాయని అంటున్నారు. వీటితోపాటు మహీంద్రా కంపెనీ నుంచి ఈకేయూవీ 100 ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తారని అంటున్నారు. దీని ధర రూ.10 లక్షల లోపే ఉంటుందని అంటున్నారు.
ఇక టాటా నానో ఈవీ కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధమవుతోంది. దీనిని రూ. 4 లక్షలకే విక్రియించే అవకాశం ఉందని అంటున్నారు. ఎంజీ మోడల్ కూడా మార్కెట్ ను తెగ ఊరిస్తోంది. దీనిని రూ.7.9 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. ఇలా రూ.10 లక్షల లోపే మార్కెల్లోకి తీసుకురావడానికి చాలా కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఏ కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.