Gangavva vs Chandrababu : చంద్రబాబును ఎందుకు తిట్టావ్ గంగవ్వా? నిజం బయటపెట్టింది

60 ఏళ్లు దాటినా చలాకీగా ఉండే గంగవ్వ వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : May 23, 2023 7:42 pm
Follow us on

Gangavva vs Chandrababu: గంగవ్వ.. ఈ పేరు, ఈ అవ్వ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛమైన పల్లెటూరి మట్టి మనిషిలా.. పక్కింటి పెద్దవ్వగా తన సహజమైన యాసతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. 60 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. వరుస వీడియోలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. మై విలేజ్‌ షోతో అందరికీ దగ్గరైన గంగవ్వ.. ఇప్పుడు అనుకోకుండా ఓ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. తనకు తెలియకుండానే జరిగిన వివాదానికి చిరకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణ కోరాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు ఓ పార్టీ నాయకులు, ఓ టీవీ చానల్‌ యాజమాన్యం.

చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..
ఓ టీవీ చానల్‌ జాతకం పేరుతో నిర‍్వహించిన ప్రోగ్రాంలో గంగవ్వ పాల్గొంది. ఇది పూర్తిగా ఏపీలోని అధికారి వైసీపీ పెయిడ్‌ కార్యక్రమంలా ఉంది. ఇందులోకి గంగవ్వను తీసుకువచ్చి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ఘాటు వా‍్యఖ్యలు చేయించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జాతకం బాగాలేదని గంగవ్వతో నిర్వాహకులు చెపి‍్పంచారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
గంగవ్వ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆమె ద్వారా బాబును తిట్టించడం ద్వారా ప్రజలకు సులభంగా అర్థమవుతుందని వైసీపీ ఇలా చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న గంగవ్వ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. దీనిపై కొంతమంది నాయకులు గంగవ్వకు ఫోన్‌చేసి మాట్లాడారు. దీంతో తనకు తెలియకుండా రాజకీయ వ్యాఖ్యలు చేసిన గంగవ్వ ఇప్పుడు బాధపడుతోంది.

క్షమాపణలు కోరుతూ..
పరిస్థితి చేయి దాటిపోతోందని తెలుసుకున్న గంగవ్వ, మైవిలేజ్‌షో టీం వెంటనే స్పందించారు. ప్రోగ్రాం నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్‌, చెప్పిన డైలాగ్స్‌నే గంగవ్వ చెప్పిందని, ఆ వ్యాఖ్యలతో గంగవ్వకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అంతే కాదు గంగవ్వతో చంద్రబాబు నాయకుడు క్షమాపణలు చెప్పేలా వీడియో చేశారు. అందులో గంగవ్వ కన్నీటిపర్యంతం కావడం అందరినీ కదిలిచింది. 60 ఏళ్లు దాటినా చలాకీగా ఉండే గంగవ్వ వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.