spot_img
Homeబిజినెస్SBI new IMPS transaction rules: SBI ఖాతాదారులకు షాక్..IMPS ట్రాన్సాక్షన్ పై కీలక నిర్ణయం..

SBI new IMPS transaction rules: SBI ఖాతాదారులకు షాక్..IMPS ట్రాన్సాక్షన్ పై కీలక నిర్ణయం..

SBI new IMPS transaction rules: State Bank of India తన ఖాతాదారులకు తాజాగా షాకింగ్ న్యూస్ వెలువరించింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన దీని నుంచి ట్రాన్సాక్షన్ చేసే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొంత నగదు ట్రాన్స్ఫర్ విషయంలో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయలేదు. కానీ ఇకనుంచి అదనపు చార్జీలతోపాటు జీఎస్టీని కూడా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చార్జీలను ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో ఇకనుంచి ఎస్బిఐ ఇంటర్నెట్, యోనో యాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసినవారికి చార్జీలు పడే అవకాశం ఉంటుంది. మరి ఎంత మొత్తంలో ట్రాన్స్ఫర్ చేస్తే..? ఎలాంటి చార్జీలు పడతాయో? ఇప్పుడు చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, Yono యాప్ ద్వారా ఇకనుంచి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే అదనపు చార్జీలతో పాటు జీఎస్టీ పడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రూ.25,000 నగదు నుంచి రూ. ఒక లక్ష వరకు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.2 తోపాటు GST పడనుంది. అలాగే రూ. ఒక లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే రూ.6 తోపాటు జీఎస్టీ విధించనున్నారు. రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కూడా రూ.6 అదనపు చార్జి తో పాటు జీఎస్టీ భారం వేయనున్నారు. మొత్తంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, Yono యాప్ ద్వారా IMPS ట్రాన్సాక్షన్లపై ఈ చార్జీలు వర్తిస్తునట్లు తెలుస్తుంది.

అయితే రూ.25,000 లోపు ట్రాన్సాక్షన్ చేస్తే ఎలాంటి చార్జీలు వర్తించమని బ్యాంకు తెలిపింది. ఈ చార్జీలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో కోట్ల మంది ఎస్బిఐ బ్యాంకు ఖాతాదారులు IMPS ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. ఇటీవల ఎక్కువగా డిజిటల్ మనీ పైనే ఆధారపడ్డారు. ఇలాంటి సమయంలో బ్యాంకు వేసే చార్జీలతో ఖాతాదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ చార్జీలు పెరగడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం IMPS ట్రాన్స్ఫర్ 24 గంటలపాటు అందుబాటులో ఉండడంతో నిర్వహణ ఖర్చులతో పాటు.. సాంకేతిక విభాగాన్ని అభివృద్ధి చేయడంలో అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు IMPS ట్రాన్సాక్షన్ పై అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. దీనిపై తక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ చేస్తే చార్జీల భారం తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అంతేకాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version