Site icon OkTelugu

Bajaj New Electric Scooter: మైలేజ్ తో పాటు స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఈ స్కూటర్ ధర ఎంతో తెలుసా?

Bajaj New Electric Scooter

Bajaj New Electric Scooter

Bajaj New Electric Scooter: Bajaj కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి ఆటోమోబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది.. దీంతో ఈ కంపెనీ నుంచి ఎటువంటి వాహనం మార్కెట్లోకి వచ్చిన వెంటనే దాని గురించి తెలుసుకుంటారు. అయితే కొత్తగా బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఇంజన్ పనితీరుతో పాటు స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్స్ సరసమైన ధర ఉండడంతో దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ గురించి సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీని గురించి చర్చ పెడుతున్నారు. ఇంతకీ ఈ స్కూటర్ ఎలా ఉందంటే..

బజాజ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీని బాడీ ప్యానెల్ స్మూత్ గా ఉంటుంది. LED లైటింగ్, ఏరో డైనమిక్ లైన్స్, ఏరో డైనమిక్ లైన్, కాంపాక్ట్ స్టాన్స్ వంటివి ఆకర్షణ ఇస్తాయి. ఇది నగర ప్రయాణికులకు అనుగుణంగా ఉండే ట్రాఫిక్ లో ఇబ్బందులేకుండా ప్రయాణించవచ్చు. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రీమియం లుక్ ను కలిగి ఉంది. ఇందులో అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ను అమ్మ చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ అయితే 345 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అత్యధికంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ చార్జింగ్ కావడానికి 5 నుంచి 6 గంటల వరకు సమయం పడుతుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీని ఉంచారు. దీని మెయింటెనెన్స్ తక్కువగా ఉండడంతో సామాన్యులకు ఇది బడ్జెట్ కు అనుగుణంగా ఉంటుంది.

బజాజ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో ఉన్న ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డిస్క్ బ్రేక్ తో ఎలాంటి అలజడి లేకుండా విపరీతమైన ట్రాఫిక్ లోనూ సులభంగా ప్రయాణం చేయవచ్చు. సిటీలో ఉండేవారు ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు బెస్ట్ రైడర్ అనిపించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.1.05 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్లో టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉన్నాయి. రియల్ టైం రేంజ్ డిస్ప్లే, స్పీడు, బ్యాటరీ స్టేటస్, రైడ్ మోడ్ వంటివి చూపించేందుకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చబడింది. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్టు, OTA అప్డేట్, యాంటీ theft అలర్టు, రివర్స్ మోడ్ వంటివి సౌకర్యవంతంగా ఉంటాయి. ఇది మార్కెట్లోకి రాగానే ఇప్పటికే ఉన్న ఓలా S1, TVS iQube, Ather Rizta వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. బడ్జెట్లో మంచి ఫీచర్స్, మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

Exit mobile version