https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ ఈవెంట్ లో ఈ పాప.. ఎవరు?

పవర్ స్టార్ పవన్ కల్యాన్ ‘వకీల్ సాబ్’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిన్న జరిగింది. పవన్ కల్యాణ్ తోపాటు ప్రముఖులంతా హాజరై ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అందరూ ప్రసంగిస్తుండగానే మధ్యలో ఓ అమ్మాయి వచ్చి ప్రసగించింది. ఆమె చెప్పిన కథ కల్పిత కథ కాదు. రియల్ గా జరిగిన సంఘటన. అందరూ చనిపోతున్న వేళ ఆ బాలిక చేసిన సాహసంతో ఇద్దరు బతికారు. ఆమె చేసిన సాహసం ఏంటీ..? ‘వకీల్ సాబ్’ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకపై […]

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2021 / 03:45 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాన్ ‘వకీల్ సాబ్’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిన్న జరిగింది. పవన్ కల్యాణ్ తోపాటు ప్రముఖులంతా హాజరై ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అందరూ ప్రసంగిస్తుండగానే మధ్యలో ఓ అమ్మాయి వచ్చి ప్రసగించింది. ఆమె చెప్పిన కథ కల్పిత కథ కాదు. రియల్ గా జరిగిన సంఘటన. అందరూ చనిపోతున్న వేళ ఆ బాలిక చేసిన సాహసంతో ఇద్దరు బతికారు. ఆమె చేసిన సాహసం ఏంటీ..?

    ‘వకీల్ సాబ్’ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకపై కనిపించింది చిన్నారి రుచిక.. ముందుగా ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆమెను ఎందుకు వకీల్ సాబ్ ఈవెంట్ కు పిలిచారో తెలియదు. అయితే ఆ తరువాత యాంకర్ సుమ కల్పించుకొని నీ లైఫ్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పు రుచిక అని అడిగింది. దీంతో ఆమె చెప్పిన దారుణ ప్రమాదం గురించి విని అందరూ సైలెంట్ అయిపోయారు.

    ‘మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎంతో మంది చిన్నారులు అసవులు బాసారు. అందులోంచి ధైర్యసాహసాలతో బయటపడింది రుచిక. ‘‘ఓసారి నేను స్కూల్ వ్యాన్లో వెళ్తున్నప్పుడు రైల్వేట్రాక్ పై బస్సు ఆగిపోయింది. డ్రైవర్ అంకుల్ ను త్వరగా వెళ్లమని చెప్పాను.. కానీ అతను వినిపించుకోలేదు. రైలు వచ్చి బస్సును ఢీకొట్టడం.. ఆ వేగంతో రైలు ముందు తునాతునకలవుతున్న బస్సు కొద్ది దూరం లాక్కెళ్లిపోయింది. ఆ బస్సులోనే ఉన్న రుచిక బస్ విండో కిటీకీ పగులగొట్టి ఇద్దరు పిల్లలను కింద పడేసింది… వారికి కొంచెం చిన్న దెబ్బలు తగిలాయి. ఆ తరువాత మా తమ్ముడిని బయట అలా బయటకు వెయ్యాలని ట్రై చేశారు. కానీ తను అందులో పట్టలేదు. ఆ తరువాత మరికొందరిని అలా విండో నుంచి బయట వేద్దామనుకునేసరికి ట్రైన్ వచ్చింది.. మా బస్సు ను క్రాష్ చేసింది.. ఆ తరువాత నేనూ దూకేశాను. హాస్పిటల్ లో కోలుకున్నాను. ’ అని రుచిక చెప్పారు.

    అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై వకీల్ సాబ్ తెరకెక్కింది.‘వకీల్ సాబ్’ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ధైర్యంగా నిలిచిన వారిని పిలిచారు. ఈ సందర్భంగా రుచికను స్టేజీపై తీసుకొచ్చి ఆమె చేసిన సాహసాన్ని చెప్పించడంతో అందరూ ఒక్కసారిగా కళ్లు చెమర్చారు. అప్పటి వరకు జోష్ లో ఉన్న ఆడియన్స్ అంతా గుండెబరువెక్కడంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రుచిక చేసిన సాహసానికి అందరూ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగించారు.