Behind The Growth Of Marwari Businesses: జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. కొందరు ఉద్యోగం ద్వారా..మరికొందరు వ్యాపారం చేయడం ద్వారా నగదును కూడబెడుతారు. ఉద్యోగం అయితే ఒకరికింద పనిచేయాల్సి వస్తుంది..కానీ ఇది ఇష్టం లేని వాళ్లు.. సొంతంగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు ఉన్నారు. ఈ క్రమంలో వ్యాపారంపై దృష్టిపెడుతున్నారు. అయితే అందరూ వ్యాపారంలో రాణిస్తారని చెప్పలేం. కొంత మందికి మాత్రమే వారు ఏ వ్యాపారం ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా మార్వాడీలు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. మిగతా వారు ఎంత ప్రయత్నించినా.. వారి స్థాయిని అందుకోలేరు. మరి వారికి కలిసి వచ్చేది ఏంటి? వారు వ్యాపార అభివృద్ధికి ఏం చేస్తారు? ఈ వివరాల్లోకి వెళితే..
దేశంలో మార్వాడీలు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వారు ఏ ప్రదేశానికి వెళ్లినా వ్యాపారం మాత్రమే చేస్తారు. ఒకరి కింద పనిచేయడానికి అస్సలు ఒప్పుకోరు. అంతేకాకుడా వారు ఏది మొదలు పెట్టినా.. అది విజయవంతం అవుతుంది. అందుకు కారణం వారు కొన్ని రహస్య పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని నమ్ముకొని వారు వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ లక్ష్మీదేవికి పూజలు చేసిన తరువాతే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
ఒకవ్యక్తి లేదా ఒక వ్యాపారంపై నరదృష్టి తీవ్రంగా ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఏ వ్యాపారం అభివృద్ది చెందదు. అయితే మార్వాడీలో నరదృష్టి లేకుండా ప్రత్యేకంగా గుర్రపు నాడాను వ్యాపార సముదాయాల్లో గుమ్మం ముందు వేలాడదీస్తారు. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆ ఇంట్లోకి పంపుతుంది. దీంతో ఎవరి దృష్టి పడినా గుర్రపు నాడా ఆకర్షిస్తుంది. దీనిని పూజ చేసిన తరువాత ఇంటి గుమ్మం ముందు అమర్చాలి. దాదాపు మార్వాడలందరూ గుర్రపు నాడాను వ్యాపార సముదాయాలు ఉంచుతారు. దీంతో వారి వ్యాపారానికి ఎటువంటి నరదృష్టి తగలదు. దీంతో వారు త్వరగా అభివృద్ధి చెందుతారు.
మార్వాడీలు చేసే మరో ముఖ్యమైన పూజ ఏంటంటే? గురివింద గింజలను ఒక ఎర్రని వస్త్రంలో ఉంచుతారు. వాటిని ఈశాన్యంలో ఉంచి పూజలు చేస్తారు.ఈ పూజలు తమ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. దీంతో మార్వాడీలు అనుకున్నది సాధిస్తారు. వారు ఏ వ్యాపారం చేపట్టినా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా మార్వాడీలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన తరువాత కనీసం రెండేళ్ల పాటు వెయిట్ చేస్తారు. ఎంత నష్టం వచ్చినా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఇలా ఉంచడం వల్ల ఏదో ఒకరోజు వారికి కలిసి వస్తుంది.
మార్వాడీలు చేసే మరో ముఖ్యమైన పని ఏంటంటే వారు డబ్బును ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేయడానికి వెచ్చించరు. ఎంత లాభం వస్తే అంత మొత్తంతో మరో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇలా బాగా అభివృద్ధి చెందిన తరువాతే ఆస్తులు కొనుగోలుచేయడం ప్రారంభిస్తారు. అందువల్ల మార్వాడీలు ఏ వ్యాపారం ప్రారంభించినా విజయం సాధిస్తారు. అంతేకుండా వారు మర్వాడీల్లో కుటుంబ సభ్యుల్లో మొగవారందరూ కలిసి ఒకే వ్యాపారం చేస్తారు. అలా వారు ఇతరులకు జీతాలు ఇచ్చే ఖర్చును తప్పించుకుంటారు.