Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలి.. డేరింగ్ అండ్ డాషింగ్ అధికారిణిగా తెలుగు రాష్ట్రాల్లో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. డైనమిక్ ఆఫీసర్ గా పేరుగాంచిన ఆమ్రపాలి వరంగల్ అర్బన్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అధికారిణిగా ప్రశంసలు అందుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమెకు యూత్ లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది.
తాజాగా కేంద్రంలో విధులు నిర్వహించిన ఐఏఎస్ ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా నియామకం అయ్యారు ఆమ్రపాలి. దీంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా నెటిజన్లు ఆమ్రపాలికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి సొంత గ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని ఎన్ అగ్రహారం. తండ్రి పేరు కాటా వెంకట రెడ్డి, తల్లి పద్మావతి. నవంబర్ 4, 1982 న విశాఖలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివారు. తరువాత బెంగళూరులోని ఐఐఎం నుంచి పీజీ డిప్లమాను పూర్తి చేశారు. ఆమ్రపాలికి ఓ సోదరి ఉన్నారు. ఆమె మానస గంగోత్రి..2007 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్. అయితే ఆమ్రపాలి 2010 వ సంవత్సరంలో యూపీఎస్సీలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ సాధించారు. అంతేకాదు ఐఏఎస్ కి ఎంపికైన అతి చిన్న వయస్కురాలు ఆమ్రపాలి కావడం విశేషం.
ఆమ్రపాలి 2011 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమీర్ శర్మ ఢిల్లీకి చెందిన వారు. ఆయన 2011లో ఐఏఎస్ కు ఎంపిక అయ్యారు. ఆమ్రపాలి తెలుగు అమ్మాయి కాగా సమీర్ శర్మ ఉత్తరాదికి చెందిన వ్యక్తి. ప్రేమించుకున్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2018 లో వివాహం చేసుకున్నారు. కాగా జమ్ములో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More