Meat In Indian Hotels: భారత్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో హలాల్ వండుతారా..? లేక జట్కానా..?

అనేక రాష్ట్రాల్లో హోటళ్లు, దుకాణాలు, రెస్టారెంట్ల యజమానులు మాంసం వడ్డించే ముందు వండింది హలాలా లేదంటే జట్కానా అని ముందే తెలపాలని నిబంధనలు

Written By: Mahi, Updated On : October 21, 2024 5:49 pm

Meat In Indian Hotels

Follow us on

Meat In Indian Hotels: ఒక్కో మతానికి ఒక్కో మత గ్రంధం ఉంటుంది. ఆ గ్రంధంలో చూపిన విధంగానే ఆ నియమాలను వారు అనుసరిస్తారు. మాంసం తినడం కొన్ని మత గ్రంధాల ప్రకారం నిశిద్ధం మరికొన్నింటిలో తినవచ్చు. అయితే, అది నియమాలకు లోబడి మాత్రమే ఉండాలి. కొన్నేళ్లు దేశంలో జట్కా, హలాల్ పై వివాదం కొనసాగింది. దీనిపై ప్రభుత్వాలు, ప్రభుత్వాల పెద్దలు, సాధారణ ప్రజానీకం నోరు పారేసుకుంది. అనేక రాష్ట్రాల్లో హోటళ్లు, దుకాణాలు, రెస్టారెంట్ల యజమానులు మాంసం వడ్డించే ముందు వండింది హలాలా లేదంటే జట్కానా అని ముందే తెలపాలని నిబంధనలు రూపొందించాయి. అయితే, పచ్చి మాంసం విక్రయించే వారు కూడా దుకాణాల ఎదుట తాము విక్రయిస్తున్నది జట్కానా లేదంటే హలాలా అనే బోర్డులు తప్పనిసరిగా పెట్టాలి. దేశంలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఏ మాంసం వడ్డిస్తారనేది ఈ రోజు తెలుసుకుందాం. నిజానికి భారత్ లోని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ అయినా జట్కా మాంసం లేదా హలాల్ విక్రయించాలనే నియమం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అది ఏ మాంసమో వినియోగదారుడు తెలుసుకునే హక్కు ఉందన్న నిబంధన ఉంది. అంటే మీరు బస చేసే ఫైవ్ స్టార్ హోటల్‌లో మాంసం తినే ముందు అది జట్కానా లేదా హలాలా అని అడగవచ్చు అది మీ హక్కు.

హోటల్ సిబ్బంది మీకు సమాధానం ఇస్తారు. వారు సమాధానం చెప్పిన తర్వాత ఆ హోటల్ లో మాంసం తినవచ్చా.. లేదా అనేది నిర్ణయించుకోవడం మీ ఇష్టం. హోటల్ లో బసకు దిగిన తర్వాత కాకుండా బుకింగ్ కు ముందు కూడా తెలుసుకునే హక్కు ఉంది. హోటల్ యజమానులు తమ కస్టమర్ల కోసం భోజన వసతి కూడా కల్పిస్తారు. మీరు కనుక ప్రత్యేకమైన మాంసాన్ని తినాలనుకుంటే సదరు హోటల్ మీ కోసం ఏర్పాటు చేయిస్తుంది.

మాంసం కోసం వధించే జంతువును ఒకే సారి కట్ చేస్తారు. దీని వల్ల జంతువు తక్షణం మరణిస్తుంది. ఈ పద్ధతిలో జంతువుకు తక్కువ బాధను అనుభవిస్తుంది. ఈ మాంసాన్ని హిందువులు, సనాతన ధర్మం శాఖల నుంచి వచ్చిన వారు ఎక్కువగా తింటారు.

ఇక, హలాల్ అనేది ఇస్లామిక్ నిబంధనల ప్రకారం తీసిన మాంసం. ‘హలాల్’ అంటే తినేందుకు ‘అనుమతించబడినది’ అని అర్థం. ఈ మాంసాన్ని వారు ఆమోదయోగ్యమైనదిగా భావిస్తారు. వాస్తవానికి, హలాల్ ప్రక్రియలో జంతువును వధిస్తే.. రక్తం పూర్తిగా ప్రవహించేలా కట్ చేస్తారు. అంటే, ఈ ప్రక్రియలో జంతువు మరణించేందుకు కొంత సమయం పడుతుంది. ఇలా చేస్తే మాంసం శుభ్రంగా, సురక్షితంగా ఉంటుందనేది వీరి నమ్మకం.

ఏది ఏమైనా తాను తింటున్నది ఏ జంతువు, ఏ మత ఆచారం ప్రకారం వధించారనేది తెలుసుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని కోర్టులు సైతం చెప్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో కావడియాత్ర సమయంలో ఇలాంటి చర్చనే జరిగింది.